ఆకర్షించాలనే వాంఛ ప్రతిసారి నిరాశను కూడా కలిగిస్తుంది. ఎంతో బాగా డ్రెస్ చేసుకొని అతను లేదా ఆమె దృష్టిలో పడాలని కోరతారు. ఒక చిరునవ్వు కోసం ఆరాటపడతారు. ప్రతి చిన్న కదలికా ఆమె కొరకే చేస్తారు. ఈ రకమైన ప్రవర్తన అధికమైతే....ఇక వ్యవహారం అంతా రివర్స్ గేర్ లోనే వుంటుంది. ఎవరితను? ఇలా వెంటపడుతున్నాడు? నానుండి అతను ఏం ఆశిస్తున్నాడు? అతను మంచివాడా, చెడ్డవాడా? అంటూ ఎన్నో సందేహాలు వచ్చేస్తాయి. అవన్నీ మీ ప్రేమను రివర్స్ గేర్ లో పడేస్తాయి. మీరు ప్రేమించే వ్యక్తి దూరం జరిగిపోతాడు. ఇక మీరు ఎంత గట్టిగా ప్రయత్నించినా ఫలితం వుండదు. ఆమెను లేదా అతనిని ఈ విఫలతకు నిందించకండి.
చాలామంది పురుషులు యువతులను ఆకర్షించాలని కొద్దిగా అతిగానే మాట్లాడతారు లేదా ప్రవర్తిస్తారు. ముందుగా యువతి అతడిని ఆకర్షించినప్పటికి కొద్ది సమయంలోనే అతనిపట్ల విముఖత చూపుతుంది. పురుషుడు మరింత ప్రయత్నం చేస్తే ఆ విముఖత లేదా అయిష్టం కొనసాగుతుంది. అదే జరిగితే, ఇక ఏమీ ఆశించకండి. అపుడు మీరేం చేయాలి? అతని ముందు ఇతరులను ప్రశంసించాలి. స్నేహితలను పొగడాలి. మీకు వారంటే ఇష్టం లేకపోయినా సరే పొగడండి. నటించండి. ప్రేమలో ఏ పని చేసినా న్యాయమైనదే నన్న విషయం గుర్తుంచుకోండి. తర్వాత మీ ఎఫైర్ కొనసాగి విజయం పొందితే, మీరు అతని స్నేహితులను చేసిన పొగడ్తలు అబద్ధాలని చెప్పేయండి.
ప్రత్యేకించి యువతుల విషయంలో నిదానంగా వ్యవహరించండి. ఆమెకు సమయం ఇవ్వండి. ఆమె మదిలోని ఆలోచనలను పసికట్టండి. ఆమెకుగల లోకం మీతోనే మొదలై మీతో ముగిసిపోతుందని చెప్పకండి. బహుశ ఆమె కూడా ఇదే తరహాలో ఆలోచించవచ్చు. మొదటి రోజునుండే ఏ సంబంధంకూడా రొమాన్స్ గా మారిపోదు. కనుక తేలికగా తీసుకోండి. దానంతటది వాస్తవం కావాలి. సహనం చూపితే విజయం వరిస్తుంది.