•  

వివాహాన్ని అపహాస్యం చేసే కాంట్రాక్టులు!

Would you sign a Romancing contract?
 
వివిధ కారణాలుగా సెక్సు కోర్కెలు అడుగంటుతున్నాయి. వివాహాలు విఫలం అవుతున్నాయి. ఈపరిస్ధితుల్లో కాంట్రాక్టు మేరేజీలు సమాజంలో ఎంతవరకు సమంజసం? మారుతున్న సమాజంలో జంటలలో వివాహ వ్యవస్ధపట్ల తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. నేటి జంటలకు కౌన్సెలింగ్ అవసరాలు తీవ్రంగా వుంటున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా అది జంటలు విడిపోవటం వరకు వస్తోంది. ఓపెన్ మేరేజీలు, లివ్ ఇన్ ఏర్పాట్లు, కాంట్రాక్టు మేరేజీలు, వంటివాటికి కాగితాలపై నిబంధనలు, సంతకాలు చేసుకుంటున్నారు. అయితే వాటిని ఎంతవరకు ఆచరిస్తారనేది వారికే తెలియాలి. చాలామంది జంటలు ఎన్ని కాంట్రాక్టులు చేసినప్పటికి సాధారణంగా వాటికి చట్టబద్ధత కల్పించటం లేదు.

అన్నింటిలోకి సెక్సువల్ కాంట్రాక్టు అనేది ఎంతో సంకుచిత భావన అని నిపుణుల అభిప్రాయంగా వుంది. వివాహంలో అవసరమైన అంశాలన్నీ దీని పరిధిలోకి రావు. ఆస్తులపంపకం, విడాకులు లేదా విచ్ఛిన్నం పొందితే వారికి అండగా ఎవరుంటారు. పిల్లలకు గార్డియన్ గా ఎవరు వ్యవహరిస్తారు? అనేఅంశాలు దీనిలో వుండవు. కాంట్రాక్టు పేరుతో విచ్చలవిడి సెక్స్ చేసుకోవడం, భాధ్యతలను విస్మరించి గాలికి వదిలేయటంగా జరుగుతోంది. అయితే, వివాహం లేదా ఇరువురి కలయిక అనేది పూర్తి వ్యాపారంగా వుండరాదని సెక్స్ సైకాలజిస్టుల అభిప్రాయంగా వుంది.

నేటి సెక్స్ కాంట్రాక్టు, వివాహాన్ని ఒక వ్యాపారంగా చేసి మెకానికల్ గా నడిచేలా చేస్తుందని, దీనిలో మంచి సంబంధాలకు అనువైన భావనలు, సున్నితత్వం, ప్రేమ, అనురాగం మొదలగు వాటికి చోటు లేదని కనుక ఈ రకమైన కాంట్రాక్టులకు, సమాజ బాగోగులకుగాను, ఎక్కడో అక్కడ అడ్డుకట్ట పడాలని వీరు భావిస్తున్నారు. సెక్స్ సంబంధం ఇతర సంబంధాలన్ని కలిపితేనే వచ్చేదని వీరు అబిప్రాయపడుతున్నారు. అభిప్రాయభేధాలున్న జంటలు అవసరపడితే విషయనిపుణులను సంప్రదించి తమ వ్యత్యాసాలను విడనాడి సంబంధాలు కొనసాగించేందుకు కృషి చేయాలి. భాగస్వాముల మధ్య సంబంధాలు బెడిసికొడితే ముందుగా నష్టపోయేది వారి సెక్స్ సామర్ధ్యం మాత్రమేనని కనుక సంబంధం లేదా వివాహానికి ముందే అన్నిటిని పరిష్కరించుకొని సంబంధంలోకి దిగాలని వీరు సూచిస్తున్నారు. కాంట్రాక్టులు సంతకాలు చేసుకోవడమనేది తరచుగా భాగస్వాములను మార్చుకోటానికే చేసేదిగా వుంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

English summary
Why the need for such a contract? , Sexual compatibility often becomes an incompatibility when relations begin to sour. Over time, when the equation between spouses begins to deteriorate, sex takes a beating. If you have sexual incompatibility at the start of the relationship, it is best to sort it before you tie the knot.
Story first published: Monday, January 23, 2012, 16:48 [IST]

Get Notifications from Telugu Indiansutras