- మొదటగా మహిళకుగల ఈ రుతుక్రమ అసౌకర్యం ఆమె తప్పుకాదని ఆమెలో హార్మోన్లు కలిగించే చర్య అని మీరు గ్రహించాలి. ఆమె ప్రవర్తన ఫన్నీగా వున్నప్పటికి మీరు ఆమెతో ఈ సమయంలో జోక్ చేయవద్దు. ఒక పురుషుడుగా ఆమె పరిస్ధితిని మీరు ఎప్పటికి అనుభవించలేదని తెలుసుకోండి.
- ఆమెకు ఇష్టంలేని పనులు ఈ సమయంలో చేయకండి. సమయాన్ని పాటించి ఆమెలో ఇష్టం కలిగించండి.
- ఆమె ప్రతిరోజూ చేసే పనులలో కొంత భాగం మీరు అందిపుచ్చుకోండి. ఆమె పనిభారాన్ని తగ్గించండి.
- ఆ కొద్ది రోజులూ ఆమెను ఒక ప్రత్యేక మహిళగా చూస్తే ఆమెకు గల భారం కొంత తేలికవుతుంది. ఆమె అందాన్ని పొగడండి. ఆమె ప్రత్యేకతలను చాటి చెప్పండి.
- ఆమెపై అధిక ప్రేమ చూపి ఆమె నమ్మేలా చేయండి. మీరు ఆమెకు ఎట్టి నష్టం కలిగించరని తెలుపండి. ఏవైనా సర్ ప్రైజ్ బహుమతులు ఇస్తే మరీ మంచిది.
- రాత్రులందు అధిక సమయం మెళుకువగా వుండకండి. - ఈ సమయంలో మహిళలు తీపి తిండిపదార్ధాలకు, ఐస్ క్రీములు, చాక్లెట్లకు ఇష్టపడతారు. అవి లావెక్కిస్తాయని, తినరాదని అనకుండా అర్ధం చేసుకొని తెచ్చి ఇచ్చేయండి.
- ఆమెకు ఈ సమయంలో కొద్దిపాటి తల, కాళ్ళు, వీపు వంటి శరీర భాగాలకు మర్దన చేసి నరాలు సడిలేట్లు చేస్తే ఆమె అద్భుతంగా భావించి మీ పట్ల ఎప్పటికి....మరెప్పటికి హేపీ భావిస్తుంది.
మహిళల రుతుక్రమం మూడు రోజుల్లోనూ పురుషులు వారితో నానా అగచాట్లూ పడతారు. వారి కోపతాపాలకు, అరుపులు, కేకలకు, ఛీత్కారాలకు గురవుతారు. మహిళల ఈ పరిస్ధితిని ప్రిమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ గా చెపుతారు. అకారణమైన కోపం, తీవ్ర మనోవేదన వంటివి వీరిని ఈ సమయంలో కుంగదీస్తాయి. అయితే, మహిళల ఈ పరిస్ధితికి పురుషులు భయపడి పారాపోవటంకంటే....వారికి ఆనందంకలిగించటమెలా? అన్నదానిపై కొన్ని చిట్కాలు పరిశీలించండి.