నేటి రోజుల్లో పిల్లలు తమ కన్నెత్వాన్ని చాలా తక్కువ వయసులోనే పోగొట్టుకుంటున్నారు. దానికి కారణం యుక్తవయసు వచ్చేనాటికి బాలికలకు 9 నుండి 10 సంవత్సరాలు బాలురకు సుమారుగా 10 నుండి 11 సంవత్సరాల వయసే వుంటోంది. కనుక కన్నెత్వం కూడా అతి తక్కువ వయసులోనే పోతోంది. దీనికి కారణాలు పరిశీలిస్తే, నేటిరోజుల్లో సెక్స్ గురించిన అవగాహన, దానిపై గల సమాచారం అతి తేలికగా టి.వి.లలోను, సినిమాలలోను, ఇతర ఇంటర్నెట్ సాధనాలలోను దొరుకుతోంది. దాంతో శరీరంలో రిలీజవుతున్న హార్మోన్లు కారణంగా వారు సెక్స్ ప్రేరిత ప్రయోగాలకు దిగుతున్నారు.
మొదటగా బాలురు, బాలికలు సమాచార బంధంలో చిక్కుకోవడం దానిని అమలుచేయాలనే కోరికలతో మరింత ముందుకు పోవటం జరుగుతోంది. ఆసక్తి కలిగి వుండటం సహజం. ఒక టీనేజర్ ప్రయోగాలు చేయాలని తాను పొందిన సమాచారం అనుభవించేయాలని చూస్తుంటాడు. సిగ్గుపడే పిల్లలకు, చొచ్చుకుపోలేని పిల్లలకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు సంభాషించటానికి మంచివి. సెక్స్ పై ఆసక్తి చూసే పిల్లలకు సైబర్ సెక్స్ లేదా ఫోన్ సెక్స్ అనేవి అందుబాటులో వుండి ప్రోత్సహిస్తాయి. దానికి తగ్గట్లు తల్లి తండ్రుల వద్దనుండి కూడా పిల్లల పట్ల పర్యవేక్షణ పరంగా అశ్రద్ధ వుంటుంది. దాంతో వారు ఏం చేయాలనుకుంటే అది చేస్తూ వుంటారు.
ఈ పరిస్ధితుల్లో టీనేజర్స్ పాటించాల్సిందేమంటే.....
- ప్రెగ్నెన్సీ లేదా సుఖ వ్యాధులవంటివి రాకుండా వుండాలంటే వారు సెక్స్ చేయరాదు.
- దానిని ఆచరించమని వారిని బలవంతపెట్టేవారెవరూ లేరు. అందుకని నీవు నిజంగా ప్రేమించేవాడివైతే, వెయిట్ చేయి అనే తీరు ప్రదర్శించాలి.
- గతంలో ఓ.కే అంటూ ఒప్పేసుకున్నప్పటికి తర్వాత అంగీకరించకపోవటం కూడా తప్పుకాదు.
- ఎన్ని పుకార్లున్నప్పటికి, ఎవరెన్ని సలహాలిచ్చినప్పటికి చాలా హైస్కూళ్ళలో కన్నె పిల్లలుగానే వున్నవారే మెజారిటీగా వున్నారని గుర్తుంచుకోండి.
- మీరు రతిక్రీడకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియపరచాలని లేదు. అదే విధంగా ఇతరులు మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన పనిలేదని గుర్తించండి.
- మీరు ఎవరినైనా ప్రేమతో ముద్దు పెట్టుకున్నప్పటికి వారితో సెక్స్ చేయాలనే అవసరం లేదని గుర్తించండి.