ముద్దులో ఇరువురి కలయిక భావనలకన్నా, నువ్వా....నేనా...తేల్చుకుందాం...అనే భావన వుంటుందట. ఆ ముద్దుతోనే పురుషుడి సామర్ధ్యం తెలుసుకోవాలని మహిళ భావిస్తుందట. పురుషుడు పెట్టే ముద్దు వెనుక తన పార్టనర్ ఉద్రేకపడాలని మాత్రమే కోరుకుంటాడు. రీసెర్చర్లు ఈపరిశోధనలో సుమారు 1000 మంది పురుషులను మహిళలను పరిశీలించారు. గాఢతపై వారిని విడివిడిగా రేటింగ్ కోరారు.
అయితే, ఇరువరూ కూడా ముద్దనేది ముఖ్యమైనదని, ఇద్దరిని దగ్గర చేస్తుందని తెలిపారట. బలవంతంగా పెట్టిన కిస్ కు మహిళ అది చెడని భావించి వదిలేద్దామనుకుంటే...పురుషుడు మాత్రం ఆమెతో కలసి సెక్స్ కూడా చేద్దామని భావిస్తాడట. ఎవరేమని భావించినా, పరిశోధకులు ఏరకంగా పరిశోధించినా ముద్దు అనేది చివరకు సెక్స్ కు తప్పక దోవతీస్తుందని వెల్లడయింది. ముద్దును ప్రధానంగా పురుషులు తడిగా వుండాలని కోరగా, తక్కువ కాలంలో అప్పటికపుడుగా చేసేవి తడిగా వుండరాదని మహిళలు వెలిబుచ్చారట.
పురుషులు తమ లాలాజలం ద్వారా టెస్టోస్టెరాన్ హార్మన్లను మహిళలకు అందిస్తారని, ఇది మహిళలో సెక్స్ భావన రేకెత్తిస్తుందని రీసెర్చి వెల్లడి చేసింది. ఈ పరిశోధన రట్జర్స్ యూనివర్శిటీలో ఒక యాంత్రపాలజిస్టు ప్రొఫెసర్ హెలెన్ ఫిషర్ చేసినట్లు ఎవల్యూషనరీ సైకాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.