బ్రిటన్ లో మహిళలు తమ వయసు నలభై దాటిందంటే చాలు...సరికొత్త హొయలు పోతున్నారట. దానికి కారణం అప్పటికి చాలా కాలంగా రతికార్యం ఆపేయటమేనట. ఇక స్కాట్లాండ్ మహిళలైతే 35 సంవత్సరాలొస్తేచాలు పడకకంటే, చేతిలో పుస్తకానికే ప్రాధాన్యత. ఆ వయసులో ఇంకా సెక్స్ చేస్తుంటే...పిల్లలు అడ్డంకని గునుస్తున్నారు. అయితే పిల్లలు లేని మహిళలు మాత్రం రెగ్యులర్ గా అద్భుత ఆనందాల్ని ఆస్వాదిస్తూ ఎన్ జాయ్ అనేస్తున్నారని ఒక తాజా సర్వే చెపుతోంది. అసలు, రతికార్యం ఈ రకంగా మాయమైపోటానికి కారణం వారి వర్కింగ్ షెడ్యూలని సర్వే సంస్ధ చెపుతోంది.
తక్కువ పని చేసే మహిళలు బెడ్ లో అధికంగా ఆనందం పొందుతున్నారు. ఉద్యోగాలు ఫుల్ టైమ్ చేసుకునే మహిళలలో సగం మంది మాత్రమే పూర్తి ఆనందాన్ని అనుభవిస్తున్నారని డెయిలీ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. మహిళలలో 26 శాతం మంది మెనోపాజ్ మొదలైతే, సెక్స్ వాంఛలు పోతాయని కూడా బాధపడుతున్నారట.
అసలు విషయం మహిళలందరూ చాలా వరకు ఆ దేశంలో మంచి ఉద్యోగాలలో వుండి అధికారాన్ని అనుభవించటమేనని, సెక్స్ చేస్తూ కూర్చుంటే వారు అదంతా మిస్సయి అతి సాధారణంగా జీవించాల్సివస్తుందని, అంతేకాక వారి పిల్లల కెరీర్ల కొరకు కూడా వారి తాపత్రయం అధికమై, తమ స్వంత సెక్స్ జీవితాల్ని పణంగా పెట్టేసి దేశంలో సెక్స్ కోరికలు మాయమయ్యేలా చేసేస్తున్నారని సర్వే ఏజన్సీ వెల్లడించింది. టైమ్ అంటూ వుంటే....నెలకోసారి మాత్రమే....ఆహ్....అభ్భా అంటున్నారట ఈ మహిళలు. ఈ అంశాలను ఆదేశంలోని సైకాలజిస్టు ప్రొఫెసర్ పౌల్ నికల్సన్ బాగా స్టడీ చేసి వెల్లడించినట్లు డెయిలీ ఎక్స్ ప్రెస్ ప్రచురించింది.