
మీరు రూమ్ లో అతని వద్ద వున్నప్పటికి ఇతర మహిళలతో మాట్లాడేస్తూ సమయం గడుపుతున్నాడా? ఆ సమయంలో అతను ఎలా స్పందిస్తున్నాడు? అతను గాల్ ఫ్రెండ్స్ ని బేబీ, స్వీట్ హార్ట్ అంటూ సంబోధించి ఫోన్ లోనే ముద్దు చేస్తున్నాడా? మీ బాయ్ ఫ్రెండ్ తో ఇతర మహిళల అఫైర్స్ ఏమైనా వినటం జరిగిందా? వీటన్నిటికి మీ జవాబు .....అవును...అయితే, మీ పురుషుడు పిల్లల వెంట పడే రకమే. మహిళలంటే మహా ఇష్టం అని చెప్పచ్చు. మరి దానిని నియంత్రణ చేయాల్సింది మీరే. లేదంటే ఏదో ఒక రోజు మీకు కూడా మోసం జరిగిపోతుంది. కనుక ఆలస్యం కాకుండానే అతనిని ఏదో ఒకరకంగా దారిమళ్ళించి నియంత్రించండి.
ఏదో మీ అదృష్టం కొద్ది తరచుగా ఆనందింపజేసే పురుషుడు దొరికాడు. మీరు అనుమానిస్తే తప్ప తానేంచేస్తున్నాడనేది కూడా మీకు చెప్పడు. కనుక ఈ విషయాలలో అతడిని అనుమానిస్తూ, తప్పు పడుతూ విషయాన్ని మరింత సీరియస్ చేసుకొని బాధలు పడే బదులుగా, మీకు తెలియనట్లు వుంటూ అతడిని మరోమారు మీ చెప్పు చేతల్లో వుంచుకోటానికి ఏం చేయాలనేది ప్రణాళిక చేసి అమలు చేయండి. సైకాలజిస్టుల మేరకు ప్రతి పురుషుడికి కొంత పురుషుడిని అనే అహంకారం వుంటూ వుంటుంది. దానిని తృప్తి పరచాలంటే, కొంతమేరకు మీరే సంయమనం పాటించి అతడిని చేయిదాటకముందే మీ దారిలోనడిచేలా చేసుకోవాలంటారు వీరు.



Click it and Unblock the Notifications



