•  

మహిళలూ మరింత జాగ్రత్త!

Preg risk
 
రతిక్రీడ సమయంలో పురుషులు రతి మొదలు పెట్టినప్పటినుండి అంగంనుండి కొద్దిపాటి ద్రవాన్ని స్రవిస్తూ వుంటారు.ఇది రతిలో అంగం తేలికగా చొరపడటానికి తేమకొరకుగాను వుంటుంది. ఇది అసలైన వీర్యంకానప్పటికి రిస్కుతో కూడినదే. గర్భం తెప్పించే అవకాశాలున్నాయి. కనుక వీలైనంతవరకు దీనిని యోనిలోకి తీసుకోకుండానే వుండండి. దీనిలో గత రతిక్రీడ సమయంలోని వీర్యం కొంత వుండే అవకాశం వుంటుంది.

- మీరు కనుక రెండోసారి రతిక్రీడ ఆచరిస్తూ వుంటే, కండోమ్ లేకుండా ఆచరించకండి.
- రెండోసారి రతిక్రీడలో తప్పక గర్భం వచ్చే అవకాశాలుంటాయి.
- ఒక్కొకపుడు ద్రవం వీర్యం రెండూ కలిసి స్కలనం అయన్యే అవకాశం వుంది. పురుషుడు దానిని తెలుసుకోలేకపోవచ్చు.
- ద్రవంతోపాటుగా కూడా మహిళ గర్భవతి అయ్యే అవకాశాలున్నాయి.
- పురుషుడి జననాంగాన్ని రెండో రతిలో వీలైనంత శుభ్రంగా కడగాలి లేకుంటే వీర్యం దానికి అంటుకునే అవకాశం వుంది.
- రతిక్రీడలో స్కలనం బయట వదలటం కూడా ప్రమాదమే. హెచ్ ఐవి లేదా ఇతర సుఖ వ్యాధులు వచ్చే అవకాశం వుంది. దీనికారణంగానే మహిళలకు మూత్ర సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా వుంది.
- స్కలనానికి ముందుగా పురుషుడి అంగం నుండి వచ్చే ఒక్క బొట్టు ద్రవం అయినా సరే అండంతో కలిసి మహిళను గర్భవతిని చేయవచ్చు.
- పిరీయడ్స్ లో ఆలస్యం అవుతోందంటే, మహిళ ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం వుంది. కనుక కండోమ్ తో తప్పని సరిగా రతి చేసి అనవసరమైన ఆందోళనలనుండి దూరంగా వుండండి.
- పొరపాటున ముందుగానే ద్రవాలు యోనిలోకి చేరితే, అది లోపలికి చేరకుండానే, వెంటనే యోనిని పూర్తిగా శుభ్రం చేయండి.

చాలామంది మహిళలు పురుషాంగం నుండి ముందుగా వచ్చే ద్రవం గర్భం తెప్పించదని భావించి అశ్రద్ధ చేస్తారు. కనుక తప్పక కండోమ్ పాటించి సురక్షితమైన రతి ఆచరించండి.

English summary
Many women feel pre-cum doesn't make them pregnant and this is why they don't care much. To have a satisfying and tension free lovemaking session, always use condoms. Don't let pre-cum or ejaculate become risky on the woman.
Story first published: Friday, January 13, 2012, 17:04 [IST]

Get Notifications from Telugu Indiansutras