ప్రధానంగా ఆల్కహాల్ బేస్డ్ డ్రింక్ ఏదైనప్పటికి అధికమైతే అది పురుషుడి విషయంలో అంగం మెత్తబడి నపుంసకత్వానికి, పిల్లలు పుట్టకపోవటానికి కూడా కారణమవుతుంది. అతిగా తాగే మహిళలకు గర్భం రావటం కష్టం. వచ్చినా నిలబడటం కూడా కష్టమే. వీరు ఎన్నో గర్భవిచ్ఛిన్నాలను పొందుతారు. వైన్, విస్కీ, జిన్, రమ్, బీర్ ఏది తాగినప్పటికి అది మీకు రతిచేయాలనే మూడ్ తెప్పించేది సహజమే. తాగిమరీ మత్తులో మహిళలతో మజా చేసేయాలని పురుషులు ఆనందించేది మరింత సహజం. కాని అదే సమయంలో మీరు తాగే ఈ మత్తుపానీయం మీలోని సెక్స్ డ్రైవ్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది. ఆల్కహాల్ దీర్ఘకాలంనుండి తాగేవారికి నరాల వ్యవస్ధ బలహీనపడుతుంది. ఆల్కహాల్ మెదడులోని పిట్యూటరీ గ్రంధులకు జననాంగాలకు మధ్య గల లింకును విచ్ఛిన్నం చేస్తుంది. మహిళల అంగం మరింత బలహీనపడుతుందని కూడా చెపుతారు.
తాజాగా ఈ అంశంపై చేసిన పరిశోధనల మేరకు ఆల్కహాల్ అధికంగా తీసుకునేవారికి పురుషాంగంలోని నరాలు శాశ్వతంగా దెబ్బతింటాయని వారు నపుంసకులవుతారని వెల్లడైంది. కనుక మీరు తగుమాత్రంగా లిక్కర్ తాగితే పరవాలేదుగానీ, ఏ మాత్రం అధికమైనా దాని ప్రభావం నేరుగా మీ జననాంగ నరాలపై వుంటుందనేది గుర్తుంచుకోండి.