ముగ్గురు కలిసి చేసే సెక్స్ ఎందుకు చెడు అనిపిస్తుంది? చాలామంది యువజంటలు, పెళ్ళి అయినవారు, కానివారు కొంతకాలం అయ్యేటప్పటికి ఇక సెక్స్ లో ప్రయోగాలు మొదలెడతారు.
మొదట్లో ఊహలతో సరిపుచ్చుకుంటూ ఇక తర్వాతి రోజులలో ఆల్కహాల్ మత్తులో తమ డార్లింగ్ చేతిలోనే కాక అక్కడే వున్న ఇతరుల చేతుల్లో కూడా ఒదిగిపోతారు. పురుషుల మజా! సాధారణంగా ఈ 'ముగ్గురి సెక్స్' పట్ల పురుషులే ఆసక్తి చూపుతారు. కాని చాలాసార్లు చివరకు వారే తమ యువతిని తప్పు పట్టటం కూడా జరుగుతుంది. సెక్స్ నిపుణుల మేరకు, పురుషుడు వేరే యువతితో ఎఫైర్ చేసినా మహిళ క్షమించి వదిలేస్తుంది. కాని పురుషుడు, తన స్త్రీ వేరే వారితో ఎఫైర్ చేస్తే సహించలేడు.
పురుషుడి భావాలు -
ముగ్గురు కలిసి చేసే సెక్స్ లో....ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అయితే, మహిళ తన పురుషుడి కదలికలు పట్టించుకోదు. ఆనందంగా వచ్చిపడుతున్న మరో మహిళా మెత్తదనాలు పురుషుడితోపాటు తానూ ఎంజాయ్ చేస్తుంది. కాని....ఇద్దరు పురుషులు...ఒక మహిళ కలసి చేసే సెక్స్ లో పురుషుడు తన మహిళ పై మరోపురుషుడు చూపే ఆసక్తికి, తన మహిళ ఆనందించే తీరుకు అసూయ చెందటమే కాదు, కోపగించుకుంటాడు. తన మహిళను మరో పురుషుడితో షేర్ చేసుకోడానికి అంగీకరించడు. తన మహిళ మరొక పురుషుని స్పర్శకు ఆనందపడుతూంటే భరించలేడు. తన అవసరం ఇకపై వుండబోదని అభధ్రత భావిస్తాడు. ఇక వారి మధ్య సంబంధం ఎలా అంతమవుతుందంటే...అది విడాకులకే.
మహిళ పరిస్ధితి -
ఈ వ్యవహారంలో చివరకు మహిళ తన ఆత్మగౌరవాన్ని కోల్పోతుంది. తెల్లవారిన రెండో రోజునుండి ఇక ఎంతో కుచించుకు వ్యవహరిస్తుంది. తనను పురుషుడు ఒక సెక్స్ బొమ్మగా వాడుకున్నాడని భావిస్తుంది. అంతేకాదు..ఇతరులకు కూడా తాను ఒక 'అంగడి బొమ్మ' గా చూపబడుతున్నానని పురుషుడిని అనుమానిస్తుంది. మహిళ బలవంతంగా రెండో పురుషుడిచే సెక్స్ చేయించబడ్డా, లేక తాను ఇష్టంగా సెక్స్ చేసినా అది బయటకు తెలిసిన తర్వాత పోయేది ఆమె ఆత్మగౌరవమే, ఆమె విలువలే! సిగ్గుతో చితికిపోతుంది...ఉదయం లేచిన వెంటనే ఇక చెడు భావన ఆమెకు కలుగుతుంది. రాత్రి చీకటిలో ఆల్కహాల్ మత్తులో తన ప్రియుడి సమక్షంలో మరో పురుషుడితో సెక్స్ చేసినందుకు బాధపడుతుంది. ఇక మరోమారు ఆ జంటను విడకుండా రక్షించటంలో మానసిక నిపుణుల సలహాలు అవసరమవుతాయి. కొంతమంది ఆ సంఘటననుండి బయటకు రాలేక మనోవేదనకు శాశ్వతంగా గురయ్యేవారుంటారు.
మూడవ వ్యక్తి -
ఇక, మీరు మీ బెడ్ రూమ్ లోకి పిలిచిన మూడో వ్యక్తి....ఈ వ్యవహారం బయట అందరికి తెలుపుతాడు. అంతేకాదు. అతనికి మారణాంతక వ్యాధులు కాకపోయినా, ఆరోగ్యాన్ని పాడుచేసే గనేరియా, హెర్పిస్, సిఫిలిస్, ఎయిడ్స్ వంటివి కూడా వుండి అవి జంటలోని భాగస్వామికి తగిలే ప్రమాదముంది. ముగ్గురి సెక్స్ లో కండోమ్ ఉపయోగించారా? మీ యువతిని పరపురుషుడికి అప్పగించిన తర్వాత కండోమ్ పగిలే అవకాశం కూడా వుంది. ఇక మరో దుదృష్టకర చర్యగా మీ యువతికి గర్భం వచ్చిందా? ఆ గర్భంలో పుట్టేది ఎవరి బిడ్డ?