•  

వివాహ వ్యవస్ధను శాసిస్తున్న మహిళ!

Kamasutra
 
నేటి యువతులు చాలావరకు అధిక కాలం సింగల్ గా వుండటానికే ఇష్టపడుతున్నారు. వారికి వివాహం లేదా ఇల్లు ఏర్పరచుకోవడం వంటివి ఏ మాత్రం త్వరపడే అంశాలుగా లేవు. ఇటీవలి ఒక సర్వే మేరకు ఇండియాలో యువతులు వివాహ వయస్సును దాటి లేటుగా వివాహాలు చేసుకుంటున్నారు. ఇపుడు వీరంతా వివాహానికి కొంత సమయం తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇక నగరంలోని యువతులు దీనిని ఖచ్చితంగా ఒప్పుకుంటున్నారు. జీవితంలో పెళ్ళి అనేది తమ లక్ష్యంకాదని కూడా వీరంటారు. గతంలో పురుషులు చేసే ఉద్యోగాలన్ని ఇపుడు యువతులు కూడా చేస్తున్నారు.

చాలామంది చెప్పే కారణం ఆర్ధిక స్వాతంత్రం వీరు కలిగి వుండటమేనంటారు. గత మహిళా తరాలు ఆర్ధిక స్వాతంత్రం కోసం తీవ్రంగా కోరుకునేవారు. అది వారికిపుడు వచ్చేసింది. ఇక వివాహం ఒకటే కాదు వారు కోరేది. వివాహాలు చేసుకున్నప్పటికి అవి విడాకులకు దోవ తీస్తున్నాయి. తల్లితండ్రులు సైతం ఆడపిల్ల వివాహానికి ఒత్తిడి తేవటం లేదు. డైవోర్సు వంటివి వారి జీవితంలో రాకూడదని కోరుకుంటున్నారు. ఈ కారణంగా వివాహ విషయాన్ని యువతులకే వదిలేస్తున్నారు.

30 సంవత్సరాలకు వివాహమైనప్పటికి మహిళలు 40 సంవత్సరాల వయసు వరకు పిల్లలను కంటూనే వున్నారు. పెళ్ళికి ముందు తమ భవిష్యత్తు లేదా కెరీర్ లో స్ధిరపడటమే వారి ధ్యేయంగా భావిస్తున్నారు. ఇక తమకు పుట్టబోయే పిల్లల సంఖ్యను సైతం ఒకటి లేదా రెండుగా నిర్దేశిస్తున్నారు. డైవోర్సు సంఖ్య దేశంలో నానాటికి పెరిగిపోతోంది. నేటి యువతీ యువకులు వ్యక్తిత్వం పేరుతో ఒంటరిగానే వుండటానికి ఇష్టం చూపుతున్నారే తప్ప వివాహ వ్యవస్ధ, కుటుంబం అంతా ఒక యూనిట్ గా వుండాలి అనే భావనలను వారిలో కలిగి వుండటం లేదు. వీరి ఈ భావనలు ఆరోగ్యకర సమాజానికి అడ్డంకులవుతాయనేది వీరు గ్రహించాలి.

English summary

 With medical advancement, the right age of marriage is no more an issue to have kids. "Today, we hear of women having kids post mid-30s. There's no pressure to get married so that you can have kids. Women now want a successful career before they head for the mandap. "Women have kids at 34, 36 and even 40 these days. That kind of pressure has definitely eased. Also most women prefer to have one or two kids so then they can take their time before having kids."
Story first published: Tuesday, December 20, 2011, 16:34 [IST]

Get Notifications from Telugu Indiansutras