•  

డెలివరీ తర్వాత రతిక్రీడ ఎపుడు? ఎలా?

Kamasutra
 
డెలివరీ తర్వాత రతిక్రీడ ఎపుడు చేయాలి? అనేది చాలామందికి సమస్యగానే వుంటుంది. మహిళకు రతిక్రీడ సమయంలో జననాంగభాగంలో నొప్పి, లేదా నొప్పి పెడుతుందనే భయం కూడా వుంటాయి. కొత్తగా తల్లులైనవారు డెలివరీ కారణంగా ఎంతో ఒత్తిడికి లోనై వుంటారు. సెక్స్ పట్ల, ప్రేమించటం పట్ల కొంత అసౌకర్యంగా వుంటారు. గైనకాలజిస్టులు, డెలివరీ తర్వాత ఆరు వారాల పాటు రతిక్రీడ ఆచరించరాదని సలహా ఇస్తారు. ఈ సమయంలో మహిళ జననాంగ భాగ టిష్యూ కణాలు నొప్పినుండి, లేదా గాయం, లేదా చినగటం వంటివాటినుండి కోలుకుంటాయని వారు భావిస్తారు.

అందుకుగాను కొన్ని చిట్కాలు చూడండి. డెలివరీ తర్వాత రతిక్రీడ ఆచరించాలంటే, పురుషుడు మహిళకు తగినంత సమయం ఇవ్వాలి. దీనితో ఆమె జననాంగం పూర్వపు స్ధితికి చేరుతుంది. జంటలు కొత్తగా పుట్టిన బిడ్డకు ఉమ్మడిగా భాద్యత, మహిళ శరీరంలో వచ్చే మార్పులకు సహనం వహించాలి, రతిక్రీడ చాలా మెల్లగా సున్నితంగా జరగాలి. బిడ్డ పుట్టిన తర్వాత మహిళలో కొత కోరిక నశిస్తుంది కనుక వారు సెక్స్ అంటే పక్కకు తొలగుతారు. కనుక ఆమెకు కావాలి అనిపించేటట్లు పురుషుడు ప్రవర్తించాలి. భయంనుండి ఆమె బయటపడేలా చేయాలి.

రతిక్రీడతో మరోమారు వెంటనే మహిళ ప్రెగ్నెంట్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు తగిన గర్భనిరోధక సాధనాలు వాడాలి. బిడ్డకు తల్లిపాలను పడుతూంటే కూడా మరోమారు వెంటనే గర్భం వచ్చే అవకాశం వుండదు. తల్లిపాలు పట్టేటపుడు ఆమెకు తగిన తేమ జననాంగంలో వుండదు. అదే విధంగా పాలలోని ప్రొలాక్టిన్ హార్మోన్ ఆమెలోని వాంఛను తగ్గిస్తుంది. కనుక ఈ సమయంలో మహిళకు ఫోర్ ప్లే అవసరం చాలా వుంటుంది.

ఇక మీరు మరోమారు కొత్తగా రతి మొదలు పెట్టామనుకునేలా ఆమెకు కౌగిలింతలు, ముద్దులూ, శారీరక మర్దనలు వంటివి అలవాటు చేయాలి. మహిళ జననాంగ భాగానికి అవసరమైన వ్యాయామాలు, కింత కూర్చోవడం, కండరాలు బిగింపు చేయడం, పడుకోవడం వంటివి రెగ్యులర్ గా చేసి కొంత బిగువు పొందాలి. మీ సెక్స్ అవసరాలపై డాక్టర్ తో వివరంగా చర్చించండి. ప్రతి రాత్రి ఖచ్చితంగా వుండాలని కోరకండి. ఎక్కువ సార్లకంటే, తృప్తిగా ఒక్కసారి ఆచరించినా చాలని భావించండి. ఇక ఇద్దరికి అనుకూలమైన సమయం నిర్ధారించుకోండి.

English summary
Maintain open channels of communication. Be open about your sexual needs and convey the message to your doctor, stressing on the point that you intend to be a very active sexual partner after childbirth. Quality matters. There shouldn't be any rush to make up for your lost fun during pregnancy.
Story first published: Friday, December 23, 2011, 16:55 [IST]

Get Notifications from Telugu Indiansutras