జంటలు ప్రేమలో పడటం, బయటకు రావటం నేటి రోజుల్లో సాధారణమయ్యాయి. పరిమితి దాటి సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. తర్వాత చేసిన తప్పులకు పశ్చాత్తాప పడుతున్నారు. ఆఫీసులలో లేదా బయటి వ్యవహారాలలో ఇతర పురుషుల ఆకర్షణ. వర్షం పడే ఒక రాత్రిలో క్షణికావేశంలో పరపురుషుడితో ఆనందకర రతిక్రీడ జరిగిపోతుంది. ఇక అది కొంతకాలంపాటు వదలమన్నా వదలదు. ఆనందంకోసం అనైతిక సంబంధం కొనసాగిస్తూనే వుంటారు. మరి ఈ విషయం స్వంత భాగస్వామికి చెప్పాలా? వద్దా? అనే సంశయం పీడిస్తూ వుంటుంది. చెపితే ఏమవుతుంది? చెప్పక పోతే మోసం చేసినట్లవుతుంది. మనసు బరువవుతుంది.
ఎందుకు చెప్పరాదు?
చేసిన తప్పును చెప్పేసినందువల్ల మీకు గల సంబంధం చెడిపోవటమే కాక ప్రస్తుత జీవితం కూడా సంకటంలో పడుతుంది. మీ పురుషుడు మీరు చెప్పే కధలన్నీ విని సర్దుకోటానికే చూస్తాడు. కాని అంత తేలికగా మరచిపోలేడు కూడాను. చేసిన తప్పు కప్పి పుచ్చుకోడం పెద్ద సవాలు. అతని చూపులనుండి మీరు తప్పించుకోలేరు. మీ ప్రస్తుతం, భవిష్యత్తు కూడా చెడినట్లే. మీకు మనో భారం తగ్గాలని తేలికగా వుండాలని చేసిన తప్పు చెప్పినందువలన మీరు అతనిని పోగొట్టుకుంటున్నారు. మహిళలవలెనే, పురుషులు కూడా తమ మహిళలు ఇతరులతో షేర్ చేయబడటాన్ని ఇష్టపడరు. మరి మీరు అసలు విషయం అతనికి చెప్పిన తర్వాత మీ భార్యా భర్తల సంబంధాలలో జరిగే పరిణామాలను ఎదుర్కొనాల్సివస్తుంది.
మనోవేదన - మీ పురుషుడికి మీరు అతనికి చేసిన మోసం చెపపేసిన తర్వాత మీరు డిప్రెషన్ లోకి వెళ్ళి పోతారు. ఈ రకమైన మనో వేదన మరింత ప్రమాదకరమైన పరిస్ధితి. ఇక ఆ పరిస్దితులలో మీరు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
నమ్మకం పోతుంది - జరిగినదంతా మీరు చెప్పేస్తారు అతను క్షమించేస్తాడు. కాని ఇక ఎప్పటికి మీపై అతనికి నమ్మకం వుండదు. మరోమారు మీ పార్టనర్ విశ్వాసాన్ని పొందటం చాలా కష్టం కాగలదు. కనుక మీ పార్టనర్ కు మీరు అతనికి చేసిన మోసానికి అసలు చెప్పకండి.
ఎందుకు చెప్పరాదనే దానికి ఇవి సాధారణంగా వుండే కారణాలు. మీరు మీ తప్పును గ్రహించి సరైన దోవలో పడటానికి రాజీ పడండి. ఎవరితోనైనా చెప్పుకొని బరువు తగ్గించుకవాలంటే అతి ఎల్లపుడూ మిమ్మల్ని సమర్ధించే సన్నిహితులైన మీ స్నేహితులకు తెలుపండి.