•  

అదిరేటి హిప్ లు - కదిలేటి కాళ్ళు!

Partyanimals
 
కొత్త సంవత్సరం పార్టీలు తింటాలు, తాగటాలతో వికారం కలిగిస్తున్నాయా? ఎక్కడ చూసినా గుంపులు, చెవులు పగిలే సంగీతాలు, నేల అదిరే స్టెప్పులు, వేడిగా, కారంగా నోటికందించే ఆహారాలు, మత్తెక్కించి వెగటుపుట్టే ఆల్కహాల్ అన్నీ మీ సామర్ధ్యానికి మించినవనిపిస్తున్నాయా? కొత్త తరహాలో నూతన సంవత్సం గడపండి.

మీ ప్రేయసిని తీసుకొని నగర పార్టీ పిలుపులు అందనంత దూరంగా కొండలమీదా, గుట్టలమీదా, చలిగాలులలో, వినీలా ఆకాశాలు, మెరిసే నక్షత్రాలు కనపడే చోటలో పరుగులుపెట్టండి. ఎన్నో అడవి ప్రాంతాలు, శాంక్చురీలు, డ్యాములు, ప్రకృతి దృశ్యాలు, రాత్రిపూట జంటలకు ఒంటరి ప్రదేశంలో అద్భుత ఆనందాన్నిస్తాయి. అర్ధరాత్రి అన్వేషణ ఎవరూ లేని చోట ఎంతో ఆనందాన్నిస్తుంది.

అవసరమైతే మీ కాటేజ్ సమీపంలో చలిమంటలు వేసి మరింత వేడి పుట్టించి ఆనందించండి. లేదా మీ ఇంటి మేడపైకి జంటగా ఎక్కండి వినీలాకాశంలోని నక్షత్రాలవంక చూస్తూ రాత్రి గడిపేయండి. అవసరమనుకుంటే, వేడి చాయ్ లు,కాక్ టెయిల్ డ్రింక్ లు బెడ్ షీట్లు, మ్యూజిక్ సిస్టం, కూడా అమర్చుకోండి. మరి ఆపై మీ ప్రియురాలితో మందు కొట్టడం మత్తెక్కించడం మాత్రమే.

మేడపైకి ఎక్కే అవకాశం లేదా? అది రిజర్వు అయిపోయిందా? అర్ధరాత్రి ఆకాశం కనపడే ప్రదేశాలు ఎన్నో వున్నాయి. మీ ఇంటి పెరడు, ఇంటిముంగిట ఓపెన్ టు స్కై ప్రదేశం లాంటివి ఎంచుకోండి. కోస్తా వెంబడి వున్నవారైతే, బీచ్ ప్రాంతాలలో పరుగుపెడుతూ గడిపేయవచ్చు. కొత్త సంవత్సర సూర్యోదయం చూడాలనుకుంటే....బీచ్ లు చాలా బాగుంటాయి. సముద్రం పైనుండి ఉదయించే సూర్యుడు నూతన సంవత్సరంలో మరచిపోలేని అనుభూతి. ఇంట్లో వుంటే....మీరు చేసేదేమీలేదు, టి.వి. ప్రోగ్రాములకు కళ్ళు అప్పగించటం తప్ప. మరో జంట దొరికితే ....కావలసినన్ని ఆటలు, డబుల్ మీనింగ్ ఢమాకాలు, క్విజ్ ప్రోగ్రాములు మీరంత మీరే ఏర్పాట్లు చేసుకొని ఆనందించవచ్చు.

English summary
An adventure group has organised a trek to this village that is inhabited by a tribal population. Uphill , you will have a chance to spot foxes, snakes, pythons and bats, says Parag Gandhi of Escapades. "Don't expect it to be a luxurious trek," he says. "It is meant for people who want to get out of the city and are bored of partying every year. It's fun to explore the wilderness in the middle of the night."
Story first published: Saturday, December 31, 2011, 17:04 [IST]

Get Notifications from Telugu Indiansutras