•  

కొత్త సంవత్సరం చిందులు గ్యారంటీ!

Kamasutra
 
2011 సంవత్సరం గుడ్ బై అంటోంది. 2012 స్వాగతిస్తోంది. మరి కొత్త సంవత్సరంలోకి అడుగిడే ముందు మీ గాల్ ఫ్రెండ్ కి అయిదే అయిదు రొమాంటిక్ విషయాలు చెప్పి కొత్త సంవత్సరం వేడుకల్లో చిందులేయండి. అసలిప్పటికి ఎన్నిసార్లు సరైన గాల్ ఫ్రెండ్ ని ఎంచుకోగలిగారు? ఎపుడూ చేతుల్లో చేతులేసుకొని కాలక్షేపం చేయటమే! మాటలు శూన్యంఆమె హృదయం కరిగిపోయే మాటలు కనీసం కొత్త సంవత్సర వేడుకలముందైనా చెపితే, మరి డిసెంబర్ 31 రాత్రి వేడుకలు, వినోదాలు మీ స్వంతం. లేదంటే.....మరో గాల్ ఫ్రెండ్ కి గాలం వేయాల్సిందే!

మరి మీ గాల్ ఫ్రెండ్ కి చెప్పాల్సిన రొమాంటిక్ విషయాలు చూడండి.
1. నీ నవ్వు అద్భుతంగా వుంది...మరో సారి ప్లీజ్... ! ఆమె హెయిర్ స్టైల్ పొగడండి. కళ్ళు మత్తెక్కిస్తున్నాయనండి. నవ్వితే నాకు కొత్త సంవత్సరంలో లిక్కర్ అవసరం లేదనండి. మీ కంటే ముందు ఇక ఆమె మిమ్మల్ని కౌగలించేస్తుంది.
2. నువ్వు సహజంగా వుంటే బాగుంటావు. మేకప్ లేకుంటేనే అందంగా వున్నావనండి. ముఖాన్ని మెచ్చుకోండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి.
3. నీతో వుంటే...నేనేమైపోయినా పరవాలేదనండి. మీ జీవితంలో ఆమెకు ప్రధమస్దానం అని తెలుపండి. పొందుకు ఎంతో రుణపడి వున్నాననండి.
4. నన్ను పూర్తి మనిషిని చేశావు. ఎంతో ఆనందం అందించావని పొగడండి. ఎంత కోపం వున్నా చప్పున చల్లారిపోతుంది.
5. నీవు నా ఫ్రెండ్ వి, క్లోజ్ ఫ్రెండ్ వి అంతెందుకు నా ప్రేయసివి, నా సర్వస్వానివి. అని చెప్పేయండి. ఇక మీ తో 31 డిసెంబర్ రాత్రి మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చి మీ దరువుకు ఆమె చిందేస్తుందనటంలో గ్యారంటీ.

English summary
Every woman is beautiful in her way. And she loves nothing more than being told so; especially by her man. When you see her next, admire her face, look deep into her eyes and say with all your heart how beautiful you think she is.
Story first published: Monday, December 26, 2011, 9:08 [IST]

Get Notifications from Telugu Indiansutras