•  

భాగస్వామి బాడీ లాంగ్వేజీ గ్రహించండి!

Kamasutra
 
ఒక మంచి రతి సంబంధంలో మీ బాడీ లాంగ్వేజ్, చర్యలు మాటలకంటే కూడా అధికంగా పనిచేస్తాయి. మీ పార్టనర్ నుండి అనేక సిగ్నల్స్ మరియు చేష్టలు వస్తూంటాయి. కాని మీరు మీ రొటన్ చర్యలలో వీటిని పట్టించుకోరు. కాని ఈ హావభావాలన్ని మీ పార్టనర్ రాత్రికి చేయాల్సిన రతిక్రీడ కు సంకేతాలు.రోజులో ఒక మంచి డిన్నర్, కంటికింపైన దుస్తులు నుండి ఒక చిలిపి మెసేజ్ పంపించటం వరకు లేదా మీ డార్లింగ్ ను బహుమతులతో ముంచెత్తటం వంటివి మీరు కావాలని కోరటం. ఇక మీరు మీ పార్టనర్ ఇచ్చే సంకేతాలను త్వరగా అర్ధం చేసుకొని బెడ్ రూమ్ యాక్షన్ కు రెడీ అయిపోవాలి.మీ డార్లింగ్ నుండి ఎటువంటి సంకేతాలు మీకు అందుతాయో కొన్నిటిని సూచిస్తున్నాం పరిశీలించండి.

రెచ్చగొట్టే దుస్తులు ధరించడం - ఏ సందర్భం లేకుండా మీ పార్టనర్ ప్రత్యేక అలంకరణ చేసుకోదు. అయితే, ఇక ఆమె అలంకరణ మిమ్మల్ని ఆకర్షించిందంటే, మీకోసం ఆమె ఎదురు చూస్తోందన్నమాటే. లైట్ గా కనపడే దుస్తులు వేసుకొని ఇంట్లో తిరుగాడుతోందంటే. అందుకు ఆమె ఎదురుచూస్తున్నట్లే.
టిప్: అటువంటపుడు ఆమె అలంకరణ చెరగకుండానే మీరు ఆమెనే మెల్లగా దుస్తులు ఒకటొక్కటి వలిచేయమని కోరండి.

పిల్లలు త్వరగా నిద్రించారంటే - సాధారణంగా మీ పిల్లలు లేట్ గా పడుకోవడం మీరు ఆమెకోసం వెయిట్ చేయడం జరుగుతూంటుంది. కాని ఒక రోజు ఆమె పిల్లలను త్వరగా నిద్రపుచ్చేసిందంటే, మీతో చక్కని రతిక్రీడకు సిద్ధమైందన్నమాటే.
టిప్: మరి పిల్లలు నిద్రపోకుండానే చేయాలంటే.... కాట్ పైన అయితే, శబ్దాలు వస్తాయి. కాట్ కాకుండా నేలపైన పక్క పరవండి, విండో కర్టెన్లు తలుపుల గొళ్ళేలు బాగా వేసి వున్నాయో లేదో చూడండి. ఇక మీ రతిక్రీడ సాగించేయండి.

రుచికరమైన ఆహారాలు
- రుచికరమైన ఆహారాలు పెడితే మీ పార్టనర్ లొంగిపోతాడు. మరి అందులోని పదార్ధాలు కోరిక రగిలించేవయితే, ఆమెకు మీరు కావాలని ఆమె తెలుపుతున్నట్లే. ద్రాక్షపండ్లు, స్ట్రాబెర్రీ లాంటివి జంటలమధ్య 'వండర్ ఫ్రూట్స్" గా చెపుతారు. వాటిని మరింత రుచికరమైన ఐస్ క్రీమ్ లో ముంచి అందిస్తే...మీరు రతిక్రీడ మొదలు పెట్టేయాలని అర్ధం చేసుకోవాలి.
టిప్: అన్నీ వండి వడ్డిస్తే, మీరే తినేయటం కాక కొన్ని రుచికర పదార్ధాలు ప్రీతిగా ఆమెకు కూడా తినిపించాలి. దీనితో బెడ్ లో మీకు మరింత సహకారం లభిస్తుంది.

ఆఫీస్ పని - ప్రతిరోజూ ఆఫీస్ నుండి లేట్ గా వచ్చే మీ పార్టనర్ ఒక రోజు ముందుగానే వచ్చేసి కూర్చున్నాడు. అంతేకాదు, తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్ అయ్యాడు. మరి అపుడు అతను సెషన్ వేయటానికి రెడీగా వున్నాడని మీరు అర్ధం చేసుకోవాలి.
టిప్: అటువంటపుడు మీరు కూడా చేసే పని లేదా ఆఫీస్ పని పక్కన పెట్టి హాట్ సెషన్ కు సిద్ధమైపోండి. మీరు కూడా రెడీగానే వున్నానని పార్టనర్ కు తెలుపండి.

ఆశ్చర్యకర బహుమతులు
- బహుమతులు అకస్మాత్తుగా ఇచ్చేస్తుంటారు. ఇక అటువంటపుడు మీ పార్టనర్ హాట్ సెషన్ కు సిద్ధమయ్యాడని గ్రహించండి.
టిప్:మరి ఇచ్చే బహుమతులు, ఒక ఎర్రని గులాబి, లేదా మంచి డిజైన్ గల లోదుస్తులు, సువాసనలు వెదజల్లే సెంట్లు వంటివయితే ఇక అది మీకు శోభనం రాత్రే. దానికి మీరు కూడా స్పందించి వెంటనే తెలపాలి.

English summary
Hot tip : "Whenever gifts are of a sexual nature like a red flower, a card with some intimate images, lingerie or s heady perfume with an arousing smell, it's a clear hint that it's time for a lovemaking night. You just need to ensure that you express it to the other partner that you loved their gifts and it has actually aroused your sexual senses"
Story first published: Wednesday, December 21, 2011, 15:26 [IST]

Get Notifications from Telugu Indiansutras