రతిక్రీడ జరిపి ఎన్నాళ్ళయిందో కూడా గుర్తు లేని స్ధితి. పనులన్ని ముగించి పడక చేరే సరికి శరీరాలు రతికి సహకరించని పరిస్ధితి. ఆర్ధిక, ఇతర కారణాల వలన మనోవేదన, ఆందోళన. కొద్దిపాటి సమయం మిగిలితే అది పిల్లలపెంపకానికి వెచ్చించటం.పెళ్ళి అయిన కొత్తల్లో మాత్రం ఎక్కడపడితే అక్కడే, ఎంత సమయం దొరికితే ఆ కొద్ది సమయంలోనే రతిక్రీడలనాచరించటం కాని పెళ్ళి అయి రెండు లేదా మూడు సంవత్సరాలు గడవక ముందే. రతిక్రీడకు సమయం దొరకకపోవటం, ఆసక్తి తగ్గిపోవటం.
బెడ్ రూమ్ లో లోపించిన రతిచర్యలను కాంపెన్సేట్ చేస్తూ....స్పాట్ మార్చి ఆఫీసులలో సహచరులతో ఎక్కడో అక్కడ సమయం చేసుకొని ఆనందించేయటం. అంతటితో ఆగక, ఆ ఆనందాలను రాత్రివేళ ఇంటి ఆనందాలతో పోల్చుకొని బాధపడటం. బెడ్ రూమ్ ఆనందాలతో బిజీగా వున్నామనుకుంటే, సరిగ్గా బెడ్ అదిరే సమయంలో ఇరవై నాల్గు గంటలూ ఆధారపడే మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టి.వి.లు ఆనందాన్ని పాడు చేయటం. రింగ్ అవుతున్న సెల్ ఫోన్ వద్దకు భాగస్వామిని వదిలి మరీ పరుగుపెట్టటం. లేదంటే...క్రికెట్ స్కోర్ అంటూ బెడ్ వదలి లివింగ్ రూమ్ లో టీ.వీ వద్దకు వెళ్ళటం.
వీటికి పరిష్కారం.....
పురుషులు తమ భాగస్వాములను స్లీపింగ్ పిల్స్ గా వాడేస్తారు. బెడ్ లో తన పని తాను చేసుకుని నిద్రలోకి జారి గుర్రు పెడతాడు. కాని, పాపం అదే సమయానికి మహిళకు తన కామ వాంఛలో సగం మాత్రమే తీరినట్లుంటుంది. ఇక వేడి చల్లారేటంతవరకు భాగస్వామిని తిట్టుకుంటూ పడుకోడం తప్ప ఆ సమయంలో మరో మార్గం వుండదు. దేశంలో 27 శాతం నెలకు లేదా రెండు నెలలకు ఒక సారి సెక్స్ చేస్తే 18 శాతం జంటలు అసలు రెండు నెలలకు కూడా రతిక్రీడ లాచరించటం లేదని ఒక సర్వే చెపుతోంది. పరిష్కారంగా మానసిక నిపుణులు చెప్పేదేమంటే...ఆందోళనలు తగ్గించుకోండి. ఒత్తిడినుండి బయటపడండి. రిలాక్సేషన్ ప్రధానం. బెడ్ లో సరససల్లాపాలు సాగించండి. చక్కటి సంభాషణలు జరపండి. వీటికిగాను ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయని సమయాన్ని నిర్ధారించుకోండి. పని ఆందోళనలు బెడ్ రూమ్ దరి చేరనివ్వకండి.
ఫోర్ ప్లే రతిక్రీడలో బాగా తృప్తినిచ్చే అంశం. దానిని ఎట్టి పరిస్ధితులలోను నిర్లక్ష్య పరచరాదంటారు. జంటలు సంభాషించుకోవాలి, సెక్స్ లో వారి ఇష్టాలు, అయిష్టాలు చర్చించుకోవాలి. ఇంకా అవసరమైతే, బెడ్ రూమ్ లో పూవులు, చాక్లెట్ లు, మంచి మ్యూజిక్, వంటి వాటికి స్ధానం కల్పించాలి. లాంగ్ డ్రైవ్ లేదా సడన్ గా రిసార్టుల్లో విశ్రాంతి, రెయిన్ డ్యాన్స్, మొదలైనవి సంబంధాలు బలపడేటందుకు దోహదం చేస్తాయంటున్నారు సెక్స్ నిపుణులు.