ములక్కాడ - దొడ్లో చెట్టుకు విరగ్గాసే ములగ కాడలున్నాయా? బాగా తినేయండి. అవి మీలోని వాంఛను, టెస్టోస్టిరోన్ స్ధాయిని పెంచుతాయి. విటమిన్ ఇ కూడా బాగా వుంటుంది. ఇది సెక్స్ హార్మోన్లను ప్రభావితంచేసి మీ సెక్స్ లైఫ్ ను పెంచుతుంది. ములక్కాడ మహిళలకు, పురుషులకు కూడా సెక్స్ సామర్ధ్యం పెంచటంలో దివ్యమైన ఔషధంగా ప్రాచీనకాలంనుండి చెపుతున్నారు. నేటికి చాలామంది తాము తినే చారు, పులుసు లేదా సాంబార్ వంటి వాటిలో ములక్కాడలు ఎంతో రుచిగా తింటారు. ములక్కాడ కూరగా కూడా వండి తింటారు.
అంజీర లేదా అత్తిపండు - అత్తిపండులో ఎమినో యాసిడ్లు అధికంగా వుంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి.
పచ్చటి తులసి - సాధారణంగా ప్రతి ఇంటిలోను తులసి చెట్టు వుంటుంది. దీనిని ఎంతో పవిత్రంగా హిందువులు ఆరాధిస్తారు. తులసి ఆకుల రసం వేడినీటిలో కలిపి తాగితే మహిళలలో కామ వాంఛను పెంచటమే కాక, జననాంగ వ్యవస్ధను శుద్ధి చేసి సంతానోత్పత్తి కూడా కలిగిస్తుందని వైద్యులు చెపుతారు.
అరటిపండు - అరటి పండులో బ్రోమేలైన్ ఎంజైమ్ వుంటుంది. అది కామవాంఛను ప్రేరేపించే టెస్టోస్టిరోన్ పెంచుతుంది. ఎంతో శక్తినిస్తుంది. పురుషుల రతి సామర్ధ్యానికి అరటిపండు బాగా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం, విటమిన బి ని ఇచ్చే రిబోఫ్లావిన్ వంటివి కూడా సెక్స్ హార్మోన్ల స్ధాయి పెంచుతాయి.