•  

శృంగారం అంటే....బెడ్ కదిలిపోవటమేనా?

First get naughty, then have lovemaking!
 
శృంగారం అంటే....బెడ్ కదిలిపోవటమేనా? భూమి కంపించే క్లయిమాక్సా? ఫోర్ ప్లే వంటి వాటికి ఇక అవకాశం లేదా? రతి ఆటకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. రతిక్రీడ ఆచరించటం భాగస్వామిని మరింత సన్నిహితం చేస్తుంది. ఈచర్యలో బయటి ప్రపంచాన్ని మీకుండే ఆందోళనలను అన్నిటిని మరచిపోతారు.

ప్రపంచంలో మరే సుఖమూ ఇవ్వనంత సుఖం మీరు మీ భాగస్వామితో పొదుతారు. మరి ఫోర్ ప్లే లో కూడా ఖచ్చితంగా మీకు ఇదే రకమైన సుఖం దొరుకుతుంది. శారీరక ఆనందమే కాదు పార్టనర్స్ ఇద్దరూ ఒకరంటే మరి ఒకరు అంకితమైపోవటానికి ఫోర్ ప్లే కూడా మంచి సాధనమే.
ఫోర్ ప్లే అనేది ప్రయోగాత్మక దశ. జీవితకాలమంతా మీరు హేపీగా ఆరోగ్యంగా వుండిపోవటానికి సహకరిస్తుంది. రతిక్రీడ సమయాన్ని పక్కన పెడితే, ఫోర్ ప్లే కొరకు వెచ్చించే సమయం జీవితకాల తీసి గుర్తుల్ని మిగిల్చేస్తుంది. ప్రేమ అంతరించదు అనేదానికి ఫోర్ ప్లే ఉదాహరణ. బాడీ కెమిస్ట్రీ లవర్స్ అర్ధం చేసుకునే సమయమే ఫోర్ ప్లే సమయం. జోకులు, ముద్దులు, ముట్టుకోటాలు వంటివి శరీరంలోని రసాయనాలను అధికం చేస్తాయి. మరి వివాహ జీవితం పదేళ్ళు గడిచిందంటే, నేరుగా దిగే రతిక్రీడకే ప్రాధాన్యంగా వుంటుంది. ఫోర్ ప్లే లేని రతిక్రీడలో ఎంతో ఆనందం కోల్పోయినట్లే. స్కలన ప్రాప్తి మాత్రమే రతిక్రీడగా భావించేస్తారు. రతిలో భాగస్వాము లిరువురి ఆనందాలకు అధిక ఆనందాన్ని కలిగించేది ఫోర్ ప్లే. ఫోర్ ప్లే ద్వారానే కామాగ్ని రగలాలి.

సగటు మహిళ వేడెక్కి భావప్రాప్తి పొందాలంటే 45 నిమిషాలు పడుతుందంటారు విషయ నిపుణులు. పురుషులకు రతిక్రీడ ఒక ఒత్తిడిని తగ్గించే సాధనంగానే యుగాలుగా గడిచిపోతోంది. కాని మహిళలకు ఒత్తిడి తగ్గాలంటే...ఫోర్ ప్లే వంటి రొమాన్స్ కావాలి. కనుక మీరు ఎంత సమయం లేకున్నా, రతిక్రీడకు ముందుగా జరిపే ఫోర్ ప్లే కి అధిక సమయాన్ని కేటాయించి మీ డార్లింగ్ పట్ల మరింత శ్రధ్ధ చూపి ఆమెతో కలసి ఆనందించండి. మీ శృంగార జీవనానికి ఫోర్ ప్లే అనేది ఒక పునాది అని గ్రహించండి.

English summary
Foreplay is the one thing women can't get enough...errr...okay, there are a few other things as well. Jhanvi Sharma (name changed on request) shares her woes, "My boyfriend is in love with quickie sex. He gets some sort of kick out of it. A long, passionate lovemaking session is just not his cup of tea.
Story first published: Friday, December 9, 2011, 11:13 [IST]

Get Notifications from Telugu Indiansutras