
యోని రతి కంటే నోటి రతి కొంతమేరకే సురక్షితం. నోటి ద్వారా రతి చేసినప్పటికి సుఖవ్యాధులు వచ్చే అవకాశం అధికంగానేవుంది. నోటి రతిలో కూడా ద్రవాలు ఒకరినుండి మరి ఒకరికి బదిలీ అవుతాయి. నోటిలో లోదా గొంతులో పుండ్ల వంటివి ఏ మాత్రం వున్నా క్రిములు వాటిలోకి చేరి శరీరంలోని ఇతర భాగాలకు పాకే అవకాశం వుంది. కనుక నోటి రతిలో సుఖ వ్యాధులు రావనేది ఒక భ్రమ మాత్రమే.
పురుషులు రతికి ఎపుడూ రెడీ గా వుంటారు? నిజమా కాదా?
సాధారణంగా పురుషులు రతిలో అలసిపోరని, ఎపుడు కావాలంటే అపుడు దానికి సిధ్ధపడతారని అందరూ అనుకుంటారు. వాస్తవమేమంటే, పురుషులు రోబట్లు కాదు. వారికి అలసట వుంటుంది. ఒత్తిడి వుంటుంది. కొన్ని సార్లు అసలు సెక్స్ మూడ్ కూడా వుండదు. కనుక పురుషుడు మీరు చేసే దాడికి రెస్పాన్స్ ఇవ్వటంలేదంటే మీ పట్ల ఆసక్తి లేకకాదు, అతనికి మూడ్ లేక అని కూడా అనుకోవచ్చు.
రతి సామర్ధ్యానికి అంగం పొడవు వుండాలి?
రతిలో మహిళను తృప్తి పరచాలంటే అంగం పొడవుగా వుండాలనేది ఒక అపోహ మాత్రమే. రతి సమర్ధవంతంగా నిర్వహించాలంటే అంగం పొడవుతో పని లేదు. మంచి మెళుకువలు కావాలి. ఇప్పటివరకు వ్రాసిన కామసూత్రలో అనేక మెళకువలున్నాయి. మరోసారి వాటిని పరిశీలించి ఆ మెళకువలతో సెక్స్ సమర్ధతలు నిరూపించుకోవచ్చు. అంగం అవసరమే కాని...దాని పొడవు లేదా పొట్టిల ఆవశ్యకత రతిలో లేదు.
ఇక అంగం స్తంభించకపోతే?
నిపుణుడైన సెక్స్ వైద్యుని సలహాతో వయాగ్రా వంటివి వాడి మరోమారు మీ పురుష సామర్ధ్యాన్ని నిరూపించుకోండి. రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్ మెంట్ తీసుకోవాలి. ఒక వయసు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుంది. అయితే, సమర్ధత వుంటే, రతి ఆచరించేయండి. తరచుగా ఆరోగ్యకరమైన సెక్స్ చేస్తే అది మీ జీవిత కాలాన్ని పెంచుతుంది. వయసు వచ్చే సరికి కోరికలు వెనుకబడటం కూడా సహజమే.
పురుషులకు ఫోర్ ప్లేలో ఆసక్తి వుండదు!
ఈ భావన కూడా సరికాదు. పురుషులకు కూడా ఫోర్ ప్లేలో ఆసక్తి వుంటుంది. అది వారికిగల ఒత్తిడిని తగ్గిస్తుంది. అంతేకాదు అంగ స్తంభన నుండి వారి భావనలను ఫోర్ ప్లే వంటిది దూరం చేస్తుంది.
అధ్భుత రతిక్రీడ...ఎప్పుడో ఒకసారి మాత్రమే!
ఎప్పుడో ఒక సారి అనుకోవలసిన అవసరం లేదు. ప్రతి సారి మీరు అద్భుతంగానే చేయవచ్చు. అయితే ఇద్దరి మధ్యా మంచి అవగాహన వుండాలి. చిన్న సంభాషణతో మొదలైనప్పటికి బెడ్ లో అద్భుత చర్యలు చేయవచ్చు. సెక్స్ లో ఇది చేయాలి? ఇది చేయకూడదు అన్న నిబంధనలేమీ లేవు. భాగస్వామి అనుమతితో ఎంతవరకైనా ఆనందించి ఇంద్రియాలను సంతోష పెట్టవచ్చు.



Click it and Unblock the Notifications




