మీరు కలలు కనే ఆ యువతిని ఒక పార్టీలో చూశారనుకుందాం....! ఆ యువతి కొరకు ఖచ్చితంగా మరో అయిదు లేదా ఆరుమంది యువకులు కూడా పోటీ పడటానికి ప్రయత్నిస్తూ ఆమె చుట్టూ తిరుగుతూనే వుంటారు. మరి వీరందరిని తప్పించి మీరు విజేతలవటం ఎలా? అందరిని ఓడించి ముద్దు గుమ్మ మెప్పు పొందటం ఎలా? విజయం ఎప్పుడూ కూడా....దాని ధర ఎంతైనా సరే వెనుకాడకుండా చెల్లించే వారిదై వుంటుంది. ఆ ధర ఆమెకిష్టమైన పిజ్జా తినిపించటంలో కావచ్చు లేదా వేలు ఖర్చు చేసి ఆమెను, ఆమె స్నేహితులతో సహా ఏదేని రిసార్టు ఎంజాయ్ మెంట్ కు తీసుకు వెళ్ళడం కావచ్చు. లేదా ఖరీదైన బహుమతులు అందించటం కావచ్చు. కనుక మీ విజయం మీ పెట్టుబడిపై వుంటుంది. పోటీదారులపై అంచనా వేయండి. ఒక్కరొక్కరిని మించిన వ్యయంతో పెట్టుబడి పెట్టండి. వారిని పోటీనుండి వ్యయం పరంగానే కాక, సమయాన్ని బట్టి ఇతర కారణాలలో సైతం వెనక్కు తగ్గేలా చూడండి. పోరాటంలో కుక్క సైజు కాదు కావలసింది....ఎంత తీవ్రతతో పోరాడుతుందనేది ? దాని విజయాన్ని నిర్ణయిస్తుందని విషయ నిపుణులు చెపుతారు.
మీరు ఆమె దృష్టిలో పడి ... అనుకూలంగా ఒక అవుటింగ్ ప్లాన్ చేశారా? ఇక పోటీలోని ఇతరులు మిమ్మల్ని ఏదో ఒకరకంగా అవమానించటానికి లేదా గేలి చేయటానికి లేదా మీరు వేస్ట్ ఫెలో అని ఆమెకు చూపటానికి ప్రయత్నిస్తారు. ఏ మాత్రం వెనక్కు తగ్గకండి. మీ ఇంట్లో చెప్పినా, మీరు నిరుద్యోగులన్నా ఏమీ పట్టించుకోకండి. మీరు ఆమెతో వ్యవహారం కొనసాగించండి. ఇక పోటీదారులు వారంతవారే వెనక్కు తగ్గుతారు. ఈ ప్రయత్నాలలో ఆమె కూడా అటూ ...ఇటూ ఊగిసలాడుతూనే వుంటుంది. కాని మీరు స్ధిరంగా, ధైర్యంగా ఆమెకై చేసే ప్రయత్నాలతో ఆమె చివరకు మీకే ఓటు వేస్తుంది. మీరు ఏసైజు వారని కాదు ఆమె చూసేది? ఎంత ధైర్యంగా, ప్రేమగా ఆమెకు అన్నీ అందిస్తున్నారనేది ఆమె చూస్తుంది.
వాస్తవంలో ఓడామని ఒప్పుకుంటేగాని...ఎవరూ ఎవరిని ఓడించలేరనే ...బ్రూస్ లీ మాటలను గుర్తుపెట్టుకోండి. మనమందరం పోటీ ప్రపంచంలో నిలబడ్డాం. కొద్దిసేపు మీ పోటీదారు మీ సమయంలో నిలబడతాడు. అంతమాత్రం చేత మీరు జారిపోరాదు. సరి అయిన గట్టి నిర్ణయం తీసుకోండి. ఆమెతో సంభాషించండి. సృజనాత్మకత చూపండి. అందరూ ఆమె అందాన్ని పొగడుతూంటే....మీరు మాత్రం ఆమె హేండ్ బ్యాగ్ జాగ్రత్త మేడం అనండి...లేదా ఆమెతో తిరిగే ఆమె కుక్కపిల్ల బాగున్నదనండి. ఆమె దృష్టిలో హుందాగా ప్రవర్తించండి.
శారీరక బలం ఒక్కటే విజయాన్ని ఇవ్వలేదు. క్రీడాకారులు ప్రపంచం కొరకు వారి వ్యాయామాలు చేసినట్లు మీరు కూడా నలుగురిలో మీ ప్రేమ విజయానికిగాను కొంత సమయం, వనరులు కేటాయించండి. విజయం కొరకు మీరు చేసే ఆధిక్యత చర్యలకు గుర్తింపు వస్తుంది. అందరూ విఫలమయితే, మీరే విజేతలు, ప్రేమించటం కూడా ఒక యుద్ధరంగమే. నేటిరోజులలో పురుషుల జీవితాలు పూర్తిగా అన్ని రంగాలలోను పోటీతో నిండి వున్నాయన్నది గ్రహించండి. చివరకు నిర్భయమైన మీ ప్రవర్తన ఆమెకు నచ్చి తీరుతుంది. ఇక విజేతలు మీరే. అయితే, విజేతగా మరోమారు మీకై మీరు ఆ పదవిని నిలబెట్టుకోటానికి కూడా జాగ్రత్తలు పడండి. మనసెరిగిన భాగస్వామి దొరికితే...అంతకు మించిన బాసట మరొకటి లేదన్న విషయం గ్రహించండి. జీవితాన్ని ఆనందంగా కొనసాగించండి.