•  

పురుషుడి హృదయం - ప్రేమకు నిలయం.... !

7 Ways To Win Husband's Heart?
 

ఎంత కస్సు బుస్సులాడినా... పూర్ ఫెలో....ఎప్పటికి మీవాడే! అయినప్పటికి మీ ప్రేమ ఆప్యాయతలకు ఆశిస్తాడు. మహిళలను మెప్పించటం కంటే, పురుషులను మెప్పించటం తేలికని గుర్తుంచుకోండి. అయితే వారి అవసరాలు వేరుగా వుంటాయి. మరి మీరు అతని మెప్పు పొందాలంటే అతనికి ప్రాధాన్యతనివ్వాల్సిందే. మరి అతని హృదయాన్ని గెలుచుకోడానికి కొన్ని మార్గాలు చూడండి.

1. మీ భర్త తల్లి తండ్రులను బాగా చూసుకోండి. బాగా అంటే వాస్తవంలో....బాగా చూడాల్సిందే. అది మీ భాద్యత కూడా. మీ తల్లితండ్రులనెలా చూస్తారో వారిని అలానే ప్రేమించాలి. ఫిర్యాదులు వారిపై ఎప్పటికి చేయకండి. మరి అతను ఇక మీరంటే ఎంతో ప్రేమిస్తాడు.

2. అతనికి స్వయంగా వండండి - ఈ ట్రిక్ చాలా పాతదే. మీ గ్రాండ్ మదర్ దగ్గరనుంచి ఇది నేర్చుకోవచ్చు. భర్త హృదయానికి దోవ కడుపు లేదా పొట్ట ద్వారానే. ఎంత బిజీగా వున్నా అతనికి క్రమం తప్పకుండా వండి పెట్టండి. వారాంతపు సెలవులలో ప్రత్యేక వంటకాలు చేస్తే అతనికి మీరు మరింత ప్రత్యేకం.

3. అతని దుస్తులు పట్ల శ్రధ్ధ వహించండి - త్వరగా బయటకు వెళ్ళాలని అడుగుతున్నాడా? సందర్భాన్నిపట్టి అతనికిష్టమైన దుస్తుల జత తీసి అందించేయండి. పాత దుస్తులు లాండ్రీకి వేయటం, తెప్పించడం వంటివి అతను మెచ్చుకుంటాడు.

4. డిన్నర్ సమయంలో అతని కొరకు వెయిట్ చేయండి - కలసి భోజనం చేయడం చాలా ముఖ్యం. అపుడు చేసే సంభాషణలు, లేదా గుసగుసలు ఎంతో ప్రేమ నింపుతాయి. ఆకలి వేస్తుంది ...నేనుండలేనంటారా? వద్దు. ఈ కొద్ది సమయం వెయిట్ చేసి అతని ప్రాముఖ్యత చూపండి.

5. ధరించే దుస్తులు....అతని కోసం - మీరు ధరించే దుస్తులు అతను ఇష్టపడేవిగా వుండాలి. జిమ్ లేదా యోగా ఏది చేసినా అతని కొరకే. అతన తప్పక మీ శరీరంలో మార్పులు నోటీస్ చేస్తూ వుంటాడని గ్రహించండి. పెళ్ళి అయిన తర్వాత మీలో మార్పు గమనించడనుకుంటారు. కాని గమనించేట్లు చేయండి. అది మీ అవసరం.

6. ఎక్కువ వినండి...తక్కువ మాట్లాడండి - ఇలా చేస్తే మీకు కోపం వచ్చినప్పటికి అది బయటకు కనపడకుండా వుంటుంది. అతను చెప్పే దానిలో మీరు ఆసక్తి చూపుతున్నారని కూడా అనుకుంటాడు.

7. సన్నిహితులుగా మెలగండి - బెడ్ లో సన్నిహితం అతని ప్రేమను తప్పక గెలుస్తుంది. శారీరకంగా ఎంత దగ్గరవుతారో మానసికంగా కూడా అంతే సన్నిహితులవుతారని గుర్తుంచండి.

English summary
To win your husband's heart is the easiest thing on earth because it has always belonged to you; even if it hasn't you can make it now. Always remember, men are easier to please than women but their requirements are different. The trouble starts when we try to evaluate or prioritize their requirements against ours. But when you are out to win back love from your husband then he should be your only priority.
Story first published: Thursday, December 29, 2011, 17:55 [IST]

Get Notifications from Telugu Indiansutras