అసలు జంటలకు శారీరక సమన్వయం అవసరమా?
ఒకరు లావుగావుండి మరొకరు సన్నగా వుంటే....మొదటగా వచ్చే సమస్య శారీరకమైంది. ఇరువురికి తృప్తిగా వుండక పోవచ్చు. అయితే, గుమ్మడి కాయ అంతటి అమ్మాయికి - కత్తిపీట లాంటి అబ్బాయి చాలు అన్న సామెత కూడా ఆలోచించదగ్గదే. స్త్రీకి కావలసింది సమర్ధవంతుడైన పురుషుడు. మరో రకంగా కూడా ఆలోచిస్తే, అంటే ఒకరు పొడవు, మరొకరు పొట్టి....ఈ జంటకు రతిలో అన్ని భంగిమలు కుదరవు. జంట ఎలా వున్నప్పటికి, తాము తమ శరీరాలు అడ్డంకి అనుకోనంత కాలం రతిక్రీడ వారికి బాగానే సాగుతుంది. కుదిరిన భంగిమలు నూటికి నూరు శాతంగా చక్కపెట్టుకుంటే చాలు. నేను లావు...అంటూ వెనక్కు తగ్గితే...అందులోని ఆనందం కోల్పోయినట్లే.
శారీరక వ్యత్యాసంకల జంటలలో... రతిక్రీడలో ఒకరు డామినేట్ చేస్తూ వుంటే...మరొకరు అణిగి వుండాలి. అపుడు ఆనందమే. ఇరువురూ డామినేట్ చేయాలంటే....ఆనందం వుండకపోవచ్చు. ఈ రకమైన జంటలు ఎంత సేపు రతిక్రీడ చేయాలి? రీసెర్చి మేరకు కొంతమంది మహిళలకు రతిక్రీడ కొద్దిసేపుగా వుండి పూర్తి ఆనందం ఇచ్చేదిగా వుండాలి. ఇతరులకు చాలా సమయం వుండాలి. పురుషులలో కూడా అంతే. ఏది ఏమైనప్పటికి పురుషుడు, స్త్రీ ఇరువురూ ఒకే సమయానికి భావప్రాప్తికి వచ్చేస్తే చాలు ఆనందమే! అది కుదరకపోతే, అసంతృప్తి. భావప్రాప్తి ముందుగా పొందిన వారికి మరి ముందుకు కొనసాగటం అసౌకర్యమే.
ఎంపికలు: రతిక్రీడలో అందరూ అన్ని భంగిమలు కోరుకోరు. మహిళలు రతిక్రీడ సమయంలో పైన పడుకోటానికి ఇష్టపడతారు. అలానే పురుషులు. కొంతమంది మహిళలకు డాగీ స్టైల్ ఇష్టం వుండదు. కొంతమంది పురుషులకు తాము కింద పడుకోడం ఇష్టం వుండదు. కనుక మీరు కోరుకునే భంగిమలు మీ భాగస్వామికి కూడా నచ్చాలి. ఎంపిక చేసుకునే భంగిమలు ఇరువురూ ఇష్టపడాలి. లేదంటే, భాగస్వాములలో ఒకరు అసంతృప్తి పడాల్సిందే.
శారీరక సమన్వయాలు లోపిస్తే, తీవ్రతలకు తట్టుకునే సమస్య కూడా వస్తుంది. క్లైమాక్స్ చేరినపుడు ఒకరిపై మరి ఒకరు బలప్రదర్శన లేదంటే గోకటం, గీరటం వంటివి కూడా వుంటాయి. వీటిని కొంతమంది సాధారణమని భావించినా మరి కొంతమంది అది తీవ్రంగా వుందని భాగస్వామినుండి దూరం అయ్యే ప్రమాదం వుంది. కనుక భాగస్వాముల బలా బలాలు ఇరువురికి సరిపోవడం కూడా ప్రధానమే. లేదంటే సరిపెట్టుకోగలిగినవారై వుండాలి.
పై అంశాలు పరిశీలిస్తే, రతిక్రీడల పూర్తి ఆనందం జంటలు అనుభవించాలంటే, శారీరక సమన్వయాలు కూడా ప్రధానమైన అంశమే అని చెప్పక తప్పదు.