అయితే ఇటీవల హ్యూమన్ సెక్సువాలిటీ అనే ఒక కెనడా జర్నల్ లో తాజాగా చేసిన ఒక అధ్యయనం ప్రచురించారు. పాప్ కల్చర్ లో భాగంగా వేడెక్కించే చూపులు, భంగిమలు వుండాలని, నైపుణ్యంతో కూడిన స్పర్శలు, క్రూరమైన చేష్టలు చేసెయ్యాలని అనుకుంటారని, కాని అసలైన సంతృప్తికర రతిచర్యలు రతిక్రీడలో పాల్గొనే భాగస్వాముల మధ్యగల భావోద్రేకాలపైనే ఆధారపడివుంటాయి. కనుక రెండు శరీరాల మధ్యగల రతి క్రీడ ఆటకు అందరూ అనుకునే రీతిలో అదనపు సమాచారం మైండ్ కు అవసరం లేదని తేలింది. అయితే, ప్రధానంగా ప్రతి జంటా చేయవలసినదల్లా....
1. ఏకాగ్రత సాధించాలి. చేసే కార్యంపై శ్రధ్ధ పెట్టాలి. ఆ క్షణంలో పూర్తిగా జీవించాలి. అనవసరమైన మొబైల్ ఫోన్ లు, ఇతర పరికరాలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవాలి. రాత్రి పొద్దు అతి తక్కువన్న వాస్తవం గ్రహించాలి.
2. శరీరాలు వేరైనా మనసులు ఒక్కటిగా పెట్టండి. ఇరువురిలోను వున్న ఎనర్జీ ఒక్కటి కావాలి. సంకుచితత్వాన్ని విడనాడండి. అవసరమైతే మరింత కలసి ముందుకు సాగండి. చివరకు కావలసింది భాగస్వాములిరువిరికి సంతృప్తి అన్న విషయం గుర్తుంచుకోండి.
3. కామ వాంఛ అధికమయ్యిందా? క్రూరంగా చేసేయాలనుకుంటున్నారా? చేయండి. తప్పులేదు. అందరూ చేసేదే అది. కాని ఏది చేసినప్పటికి మీ భాగస్వామి పట్ల మర్యాద చూపండి. ప్రేమ ప్రదర్శించండి. ఆమె పట్ల జాగ్రత్త, ఒకరంటే మరిఒకరి ప్రేమ, ఒకరి చేష్టలు మరి ఒకరు అంగీకరించటం వంటివి వున్నాయని గుర్తుంచుకోండి.
4. సంతృప్తికరమైన రతిక్రీడ ఆచరించాలనుకునే వారు తమ భాగస్వామి శారీరక చేష్టలకు అనుభూతి పొందుతూ స్పందించాలి. మాటలూ, చేష్టలూ ఒకరికి మరి ఒకరు సహకరించాలి. ఎంత చిన్న చేష్ట అయినా అనుభూతులు పొందాలి.
5. నిజాయతీని ఆచరించండి. మీరు ఒక గొప్ప శృంగార పురుషుడే కావచ్చు. అవ్వండి. కాని నిజాయతీతో వ్యవహరించండి. మీరు భావిస్తున్నది, ఆశిస్తున్నది ఏమిటో ఆమెకు తెలుపండి.
6. ప్రేమికులు ఒకరంటే మరొకరు తామేమిటో ప్రదర్శించుకోటానికి వెనుకాడరు. ఒకరు మరి ఒకరి కౌగిలిలో బందీలైపోటానికి ఇష్టం చూపుతారు. చివరకు తమ ఆత్మలతో పెనవేసుకుంటారు.
7. అన్వేషణ....చేయండి. మిమ్మల్ని ఆపే శక్తి ఏదీ లేదు. రతిక్రీడ ఒక సాహసం. రతి క్రీడ అనేది ఒక అన్వేషణ అనుకుంటే ప్రేమికులు అందులో భాగస్తులే. అందులోని ఆనందాతిశయాలు లేదా కష్ట నష్టాలకు వారే భాద్యులు.