•  

శరీరంలో ఎత్తులూ .... పల్లాలూ అధికమయ్యాయా?

Make Love To Banish The Bulges
 
శరీరంలో కొవ్వు తగ్గాలని శ్రమ పడుతున్నారా? ట్రెడ్ మిల్స్, జోగింగ్ వంటివి తగ్గించలేకపోతున్నాయా? మరిక... కొత్త వ్యాయామం ఒకటి మొదలుపెట్టండి. అదే....రొమాంటిక్ క్రీడ!

ఇకపై ట్రెడ్ మిల్, దూరం నడవటం, లేదా ఆహారం తగ్గించటం, మీ కిష్టమైన రుచులు కోల్పోవటం వంటివి చేయకండి. తాజాగా ఒక వ్యాయామ నిపుణుడు సూచించిన మేరకు పూర్తి కామక్రీడ ఆచరించండి. ఎక్సర్ సైజ్ బదులుగా సెక్స్ ఎక్సర్ సైజులు చేయండి. కావలసినంతగా చేస్తే ఎంతో స్లిమ్ అయిపోతారు.

రెండు షాట్లకు ఒకే పిట్ట అనే సామెతగా, సెక్స్ ఆటను వ్యాయామానికి జత చేస్తే కావలసినంత బాడీ ఫిట్ నెస్ ఏర్పడుతుంది. మరి ఫిట్ గా వుంటే శరీరం మరింత ఉల్లాసాన్ని కోరుతుంది. రతిక్రీడల్లో శరీరానికవసరమైన అన్ని ప్రధాన అంశాలు అందుతాయి. గుండెను బలపరచే రక్తప్రసరణ, మంచి కొల్లెస్టరాల్ వృధ్ధి, బరువు నియంత్రణ, మంచి నిద్ర, అధిక శక్తి, అన్నిటికి మించి ఎక్కువ కాలం జీవించటం అది కూడా హాయిగా సుమా!
ఫాక్స్ న్యూస్ సంస్ధ చేసిన సర్వేల మేరకు ప్రత్యేకించి మహిళలు రతిక్రీడల తర్వాత ఫిట్ నెస్ సంతరించుకోవడమే కాదు, మరింత ఆకర్షణీయంగాను, అందంగాను కనపడుతున్నారట. వారిలోని ఈస్ట్రోజన్ స్ధాయి పెరుగుతోందట. ఇది శరీరాన్ని మెరిపించటం, మెత్తటి వెంట్రుకలనివ్వటం చేస్తోంది. పట్టిన చెమటలతో చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకోవడంతో చర్మంలో మంచి నిగారింపు వస్తోందట.

కాని ప్రతి రోజూ అదే పనా? ఇందుకుగాను సెక్స్ నిపుణుడు డా. ఓనీ క్రిస్టిన్ ఫుల్ బ్రైట్ ఏం చెయ్యమంటున్నాడో చూడండి:
మీరు పడే శ్రమ రక్తపోటు అధికం చేయటం, నాడి బాగా కొట్టుకోవడం, హార్టు రేటు వేగం కావడం చేసేదిగా వుండాలి. వ్యాయామం ఏదైనప్పటికి అది మీకు బలాన్ని, దమ్మును ఇచ్చేదిగాను, సరళంగాను వుండాలి.

వారానికి 3 నుండి 5 సార్లు చొప్పున, ఒక్కొక్క సారి కనీసం ఒక అరగంటను మీ భాగస్వామితో కలసి పూర్తిగా ఆనందించండి. అరగంట సమయం ఎక్కువేమీ కాదు. ఏ టీవీ కార్యక్రమం చూసినా కనీసం 30 నిమిషాలు పడుతుంది. కాని దీని వలన మీ ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాలు అపారం. 30 నిమిషాలు పూర్తి స్ధాయిలో రతి చేస్తే 350 కేలరీలు ఖర్చవుతుంది. ఇదే మొత్తం మీకు ఇతర వ్యాయామాలు అంటే నడక, పరుగు వాటిలో కూడా ఖర్చవుతుంది.

పూర్తి స్ధాయి రతిక్రీడలు వారానికి కనీసం అయిదు మార్లు చేస్తే 1,650 కేలరీలు ఖర్చవుతాయి. పైన పడుకుని చురుగ్గా పాల్గొనే వ్యక్తికి మరింత కేలరీలు ఖర్చవుతాయి. ఏకాగ్రత అవసరం. మీ లక్ష్యం కేలరీలు ఖర్చు చేసేదిగా వుండాలి. కొద్ది వారాలలో మీ పొట్ట, వీపు, పిరుదులు, కాళ్ళు, చేతులు అన్ని మరో రూపం పొందుతాయి. మీరు చేసే రతి చర్యలు రొటీన్ గానే వుండనవసరం లేదు. బోరింగ్ గా వుండనవసరం లేదు. విభిన్నంగా ప్రవర్తిచండి. బెడ్ రూమే అవసరం లేదు. ఇంటిలోని వివిధ ప్రదేశాలలో అనుకూలంగా ఆచరించండి. రతి చర్యల తర్వాత ఒకరిపై మరి ఒకరు శ్రధ్ధ వహించండి. చెమట పట్టేట్లు చేసి కలసి స్నానాలు చేయండి. కనుక ఇకపై బోర్ కొట్టే జిమ్ కు బైబై చెపుతూ... బెడ్ రూమ్ కు స్వాగతం పలకండి.

English summary
Aim for variety. Your sexercise routine doesn't have to be routine. You can't take it for granted that sexercising won't be boring, at least not in the same way as your treadmill. So get creative. Watch what you eat and maintain moderate exercise out of the bedroom. Take care of each other post-workout. After working up a good sweat, you'll have to hit the shower.
Story first published: Thursday, October 27, 2011, 14:08 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more