ఆ ఒక్క యువకుడే కాదు, యువ్వన దశలో ఉన్న అత్యధిక శాతం మంది 'హస్త ప్రయోగం' పై వివిధ రకాల అపోహలకు లోనవుతున్నారు. లైంగిక అనుభవం లేని వారికి మాత్రమే కాదు ఉన్న వారికి కూడా హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంటుంది.
శృంగార భావనలను అదుపు చేసే హస్తప్రయోగ ప్రక్రియ స్వయం సంతృప్తికి దోహదపడుతుంది. శృంగార వాంఛలో కొట్టుమిట్టాడే ప్రతి పురుషుడూ, ఇదే చివరి సారంటూ.. హస్త ప్రయోగ చర్యను కొనసాగిస్తూనే ఉంటాడు.
హస్తప్రయోగం చేసుకోవటం వల్లే ఆనారోగ్యానికి గురువుతున్నామని అనుకోవటం అనర్థదాయకం, హస్త ప్రయోగం శృంగారం సామర్ధ్యాన్ని హరించివేస్తుందనటం అవివేకమంటున్నారు వైద్యులు. అతిగా హస్త ప్రయోగం చేసుకవడం వల్ల, అంగం బలహీనపడుతుందనటం అర్ధంరహితమని వీరు ఖండిస్తున్నారు. శరీర అవయవాలు చురుకుగా పనిచేయాలంటే, తరచూ వాటికి పనిపెడుతూ ఉండాలట.
తరచూ హస్త ప్రయోగంలో పాల్గొనటం వల్ల మానసిక ఒత్తిడి తొలిగిపోవటంతో పాటు నూతన ఉత్తేజం లభిస్తుందట. అంతేకాకుండా చెడు దారుల వైపు వెళ్లాను ఆలోచన దరికి చేరదట. ఈ నేపధ్యంలో హస్త ప్రయోగం అలవాటు లాభదాయకమో, నష్టధాయకమో డిసైడ్ చేసుకోండి.