హారిస్ ఇంటర్ యాక్టివ్ సర్వే సంస్ధ ఈ సర్వేలో 2,412 పెద్దలను విచారించగా, వారిలో 271 మంది లెస్బియన్లు, గేలు వున్నారట. సాధారణ సంపర్కులు 25 శాతంమంది మాత్రమే కరెంట్ అఫైర్స్ బ్లాగ్ చదువుతూండగా, వాటిని చదివే హోమో సెక్సువల్స్ శాతం 36 శాతంగా వుంది. హోమోసెక్స్వల్ సంపర్కులకు వినోదం, మ్యూజిక్ బ్లాగులు బాగా నచ్చుతున్నాయట. ప్రత్యేకించి వీరు పాప్ మ్యూజిక్ బాగా ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. ఈ బ్లాగులకు సాధారణ సంపర్కులనుండి 25 శాతం మాత్రమే స్పందన వస్తోందని సర్వే వెల్లడించింది.
సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు హోమో లకు హెటిరోలకు కూడా డేటింగ్, బిల్డింగ్ కాంట్రాక్టులు, ఆన్ లైన్ గేములు మొదలైన వాటికి ఉపయోగపడుతున్నాయి. ఫేస్ బుక్ లో ఇప్పటికి 73 శాతం హోమోసెక్స్వల్స్ వున్నారని కనుగొనబడింది. స్వలింగ సంపర్కులు కూడా సాధారణసంపర్కులవలే అన్ని విషయాలలోను తాజా సమాచారాన్ని పొందటానికిగాను, వారి కార్యకలాపాలను సాగించటానికి గాను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై అధిక మక్కువ చూపుతున్నారని సర్వే తెలిపింది.