•  

పురుషుడు లావెక్కితే రొమాన్స్ వెనకపడుతుందా?

Fat Men Lack Bedroom Confidence!
 
రతిచర్యలు ఆనందాన్ని కలిగిస్తాయి. భాగస్వాములు తాము ప్రేమించే వ్యక్తులతో శృంగారం చేయటానికి ఆసక్తి చూపుతారు. చివరకు పూర్తి సంతృప్తి కూడా పొందుతారు. వివాహం అయిన తర్వాత మహిళలు లావెక్కి తమ భాగస్వాములకు ఆకర్షణలేకుండా కనపడతారు. ఈపరిస్ధితి మహిళలకే కాదు పురుషులకు కూడా వుంటుంది. ఇటీవల ఇంగ్లాండ్ లో చేసిన ఒక రీసెర్చిలో పురుషులు లావెక్కుతున్నకొద్ది బెడ్ రూమ్ సామర్ధ్యం తగ్గుతుందని తేల్చారు. లావెక్కిపోవటం అనేది శృంగార చేష్టలలో మగకు ఆడకు కూడా సమస్యగానే వుంది.

పరిశోధకులు చేసిన రీసెర్చి మేరకు 5,000 మందికి పైగా పురుషులు ఆకర్షణ లేకపోవటంవలన తమ భాగస్వామితో రతిక్రీడ మొదలు పెట్టలేకపోతున్నారని శారీరక రూపం బెడ్ రూమ్ లో వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోందని తెలిపినట్లు తెలుస్తోంది. తమ బెడ్ రూమ్ సామర్ధ్యాలను పెంచుకోటానికి, ఒకరినొకరు ఆనందపరచుకోడానికి, బరువు తగ్గించుకోవాలని భావస్తున్నట్లుగా కూడా తెలిపారు. రీసెర్చిలో వెల్లడైనదేమంటే, రతి సంబంధిత చర్యల్లో, ఆత్మ విశ్వాసం సన్నగిల్లేది మహిళలకే కాదు పురుషులకు కూడానని తేలింది.

పురుషులు సెక్స్ పరంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికి వాటిని చెప్పుకోటానికి నిరాకరిస్తారు. కనుక వీరికి ఆన్ లైన్ లో పరిష్కారాలు చూపాలని, అపుడు తగిన పరిష్కారాలు సౌకర్యవంతంగా పొందగలరని సెక్స్ నిపుణులు చెపుతున్నారు. పురుషులు తమ సమస్యలను తామే వుంచుకోకుండా, వెల్లడించుకోవాలి. వెల్లడించుకుంటే కావలసినంత సహాయ సహకారాలు దొరుకుతాయి. ఆపై వారు తమ రొమాంటిక్ జీవిత సమస్యలు పరిష్కరించుకొని మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగగలరని కూడా నిపుణులు చెపుతున్నారు.

English summary
Love making is a certain type of pleasure that one goes through, Partners feel the necessity to make love with the person they love the most and in the end result they get extreme satisfaction.It is not just women who have 'fat days" when they don't feel attractive to their partners – a new UK research has shown that gaining weight also lowers men"s confidence in the bedroom.
Story first published: Friday, October 28, 2011, 12:46 [IST]

Get Notifications from Telugu Indiansutras

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Indiansutras sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Indiansutras website. However, you can change your cookie settings at any time. Learn more