ఉరుకుల, పరుగుల ప్రపంచంలో కాలంతో పరిగెట్టక తప్పదు.., మారుతన్న జీవన శైలి, పని ఒత్తిడి దాంపత్య జీవితంలో నిప్పులు పోస్తుంది. నవతరం దంపతులు విద్యావంతులై ఉండటంతో భర్తలతో సమానంగా భార్యలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది శుభపరిణామమే, అయితే గంటల కొద్ది పనిలో నిమగ్నమవటం, కంప్యూటర్ల ముందు కూర్చోవడం వంటి అంశాలు మహిళలకు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవటం వల్ల నుడుం నొప్పితో భాదపడుతున్న పలువురు మహిళలు శృంగార జీవితం పట్ల చికాకును వ్యక్తం చేస్తున్నారని అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి.
వివిధ కార్యాలయాలు, కంప్యూటర్ కేంద్రాలలో గంటల తరబడి పనిచేసి ఇంటికి చేరుకున్న మహిళలు అధిక శాతం నడుం నొప్పితో భాదపడుతున్నారని, ఇదే సమయంలో శృంగారంలో పాల్గొనడంతో నొప్పి మరింత ఉధృతమవుతుందని సర్వేలు తేటతెల్లం చేశాయి. ఈ ప్రభావం కారణంగా వారంలో ఒకసారి కూడా 'సంభోగ ప్రక్రియలో' పాల్గొనలే పోతున్నారట. ఇలాంటి భార్యల ప్రవర్తనతో విసిగిపోతున్న భర్తలు తమ బంధాన్ని తెగతెంపులు చేసుకునేందుకు సైతం వెనకాడటం లేదట.
విడాకులు ఈ సమస్యకు పరిష్కార మార్గం కాదని నిపుణులు సూచిస్తున్నారు. పని వేళల్లో 'స్త్రీ'లు ఒకే పొజిషన్ లో కూర్చోకుండా, వివిధ విధానాల్లో కూర్చోవాలని, అంతే కాకుండా ప్రతి రెండు గంటలకు '15 నిమిషాల సేపు' లేచి తిరుగుతుండాలని సూచిస్తున్నారు. కలయక సమయంలో 'నడుము భాగం' పై ఒత్తిడి పడని భంగిమల్లో రతి జరుపుకోవాలని వీరు చెబుతున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.
English summary
Back pain, especially lower back pain, makes most movement difficult and some impossible. Back pain symptoms can affect everything from daily living tasks to your job to intimacy.