•  

కలిసి స్నానం చేయండి ! ఆ మజాయే వేరు !!

Sex
 
దాంపత్య సుఖం చప్ప చప్పగా ఉందా ? అయితే, ఇద్దరూ కలిసి స్నానం చేయండి..ఫలితం అదిరిపోతుంది అంటున్నారు సైకాలజీ నిపుణులు. సాధారణంగా జంటలు రొటీన్ సెక్స్ ను చేసుకుంటూ ఏదో ఒక దశలో బోర్ కొట్టి పడకగదిలో నిశ్శబ్ద రాజ్యానికి ప్రవేశం కల్పిస్తుంటారు. కానీ రొటీన్ కు భిన్నంగా పలు రకాల పద్ధతుల్లో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేస్తే దాంపత్య జీవితం ఫెవికాల్ బంధంలా అతుక్కుని ఉండిపోతుందంటారు పరిశోధకులు.

ప్రత్యేకించి రాత్రిపూట దంపతులిద్దరూ కలిసి స్నానం చేస్తే రతి కార్యక్రమంలో అంతకు ముందుకంటే ఎక్కువ ఆనందాన్ని చవి చూస్తారని చెపుతున్నారు.
అయితే, కలిసి స్నానం చేయడానికి స్త్రీ కాస్తంత సిగ్గును చూపి వెనక్కు తగ్గుతుంది. కనుక పురుషుడు మరికాస్త చొరవ చూపి ఆమెను ఒప్పించగలిగితే ఆ అనుభవాన్ని ఆమె మర్చిపోలేదని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కలిసి స్నానం చేసే సమయంలో అంతకు ముందు మనసులో, తనువులో ఏదైనా సిగ్గు, బిడియం లాంటివి ఉంటే అవి కూడా పోతాయనీ, ఫలితంగా సెక్స్ సుఖాన్ని పూర్తి స్ధాయిలో ఆనందించగలుగుతారని వీరు చెపుతున్నారు.

బాత్ రూమ్ లో కలిసి స్నానం చేసేటపుడు ఇద్దరూ షవర్ కింద స్నానం చేస్తే మజా ఇంకా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు... స్నానం చేసే సమయంలో విభిన్నమైన ఆలోచనలతో ఒకరి తనువులో అందాలను మరొకరు పొగడ్తలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, ఇది శృంగార జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుందని పేర్కొంటున్నారు.

English summary
Married couple at some point of time or other get bored in their routine sex life and give room for silence in their bed rooms. In such cases, taking a bath together relieves them from the boredom. In the process, all the inhibitions within them disappear and the couple can enjoy their sex life at highest levels.
Story first published: Monday, July 25, 2011, 17:17 [IST]

Get Notifications from Telugu Indiansutras