1. వయాగ్రా, సియాలిస్ మొదలైన మందులు పురుషుల నపుంసకత్వాన్ని నివారిస్తున్నప్పటికి, కొన్ని సహజ చికిత్సలు కూడా వున్నాయి. అవేమంటే, మాదక ద్రవ్యాలు, ఆల్కహాలు మొదలైనవి పూర్తిగా వదిలేస్తే జననాంగంలో రక్త సరఫరా పెరిగి కొంత మెరుగవుతుంది.
2. ఆయుర్వేద మందు అయిన అశ్వగంధ ఈ సమస్యలో తగిన శక్తిని, పురుషత్వాన్ని పెంచి జన్మనిచ్చే సామర్ధ్యాన్నిస్తుంది. ఇది వాడితే మత్తెక్కుతుంది. ఒక సహజమైన మత్తు మందు వాడినట్లే. దీనిని ఇండియన్ జిన్ సెంగ్ అంటారు.
3. ట్రిబ్యులస్ టెర్రెస్ట్రిస్ అనే ఔషధ మొక్కను ఆయుర్వేదంలో సంతానం కొరకు వాడతారు. ఇది వాడితే హార్మోన్ల స్ధాయి పెరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ స్ధాయి పెరుగుతుంది. పిడిఇ 5 ఎంజైములు అధికమవుతాయి. వీటితోపాటు బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది.
4. ఆహార విలువలనిచ్చే జింక్, సెలీనియం, విటమిన్ ఇ మరియు సి, బయో ఫ్లేవనాయిడ్లు, గుడ్లు, ఉడికించిన బంగాళ దుంపల తొక్క మొదలైనవి జననాంగం నిలబడేందుకు దోహదం చేస్తాయి.
5. మెంతులు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ములక్కాడలు కూడా పురుషుల నపుంసకత్వాన్ని దూరం చేస్తాయి. వీటిని ప్రతిరోజూ నములుతూంటే పరిస్ధితి మెరుగవుతుంది. ఇవే కాక, బెండకాయమొక్క వేళ్ళు, ఎండు ఫలాలు, బాదం పప్పు, పాలలో ముంచి తింటే పరిస్ధితి మెరుగవుతుంది.
ఈ రకమైన ఆహారాలే కాక, ప్రతి రోజూ సర్వాంగాసన, మత్స్యాసన, శవాసన, అర్ధ మత్స్యాసన వంటి ఆసనాలు మైండ్ ను రిలాక్స్ చేసి బ్లడ్ సర్కులేషన్ సాఫీ చేసి సమస్యను పరిష్కరిస్తాయి. ప్రకృతి వైద్యాలైన మడ్ ప్యాక్ వేయటం, చల్లని నీటిని పోయటం, నూనెలు మర్దన చేయటం మొదలైనవి కూడా పురుషుల జననాంగ బిగువును కలిగిస్తాయి.