రతిక్రీడ వలన మరో ప్రధాన ప్రయోజనం ఏమంటే....రక్తపోటు తగ్గించటానికి బాగా సహకరిస్తుందని సెక్స్ నిపుణులు, మేరేజ్ కౌన్సెలర్ ఇజ్రాయల్ హెల్ ఫాండ్ ధృవ పరిచారు. రతి చర్యలు ఆనందాన్ని కలిగించే డోపమైన్ కార్టిసోల్ వంటి హర్మోన్ల విడుదలకు సహకరించి డిప్రెషన్ పోగొడతాయి, శక్తిని అధికం చేసి మనోభావాలు ఊహించని రీతిలో మారేట్లు చేస్తాయి.
కేలరీలు తగ్గే ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అంతేకాదు, రతిక్రీడ వలన రక్త సరఫరా మెరుగుపడి తలనొప్పులు, సైనస్ వంటివి తగ్గుముఖం పట్టే అవకాశం వుంది. కనుక 'తల నొప్పిగా వుంది..ఇవాల్టికి....... వద్దులే' అనే సాకులు ఇక సాగవని చెప్పవచ్చు. ఆరోగ్యకర సెక్స్ జీవితం కలవారు సంపూర్ణ ఆరోగ్యం కలిగి వుంటారని, వీరే తరచుగా జిమ్ లకు వెళ్ళడం, చక్కటి ఆహారం తీసుకోవడం వారి శరీరం పట్ల శ్రధ్ధ కలిగి వుండటం చేస్తారని సెక్సాలజిస్ట్ ఇయాన్ కెర్నర్ చెపుతారు. మీరు కనుక ఒంటరిగా భావిస్తూ అధిక బ్లడ్ ప్రెజర్ కలిగి వుంటే ఇవన్నీరతిక్రీడ ఆహ్లాదాన్ని పోగొట్టుకున్నట్లే. నిపుణులు తెలిపే ఈ అంశాలన్ని చక్కటి రతిక్రీడనాచరిస్తే అంతులేని శారీరక మానసిక ప్రయోజనాలు చేకూరుస్తాయని వివరిస్తున్నాయి.