•  

సెక్స్ విషయంలో భార్యలకు నచ్చనివి ఏమిటి?

Romance
 
భార్యలు సాధారణంగా తమ భర్తలతో శృంగారాన్ని, రతిక్రీడను ఆస్వాదించాలని భావిస్తారు. ఈ విషయాన్ని గ్రహించలేని కొంతమంది పురుషులు తమ వికృత చేష్టలతో భార్యకు చిర్రెత్తేలా వ్యవహరిస్తారు. దాని వల్ల భాగస్వామి మీపై కోపగించుకోవడం మాత్రమే కాకుండా సెక్స్ పట్ల విముఖత ప్రదర్శించే అవకాశాలు ఉన్నాయని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల అర్థాంగి మనసు తెలుసుకుని సెక్స్‌కు ఉపక్రమించాలని వారు సూచిస్తున్నారు. సెక్స్ సమయంలో చేయకూడనివి కొన్ని ఉన్నాయని, వాటిని పాటించాలని అంటున్నారు.

కాలంతో పాటు మనుషుల అలవాట్లు, వాడే వస్తువులు మారిపోతున్నాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఈ ఫోన్ పడక గదిలో చేరి స్త్రీపురుషుల మధ్య సాగే ఏకాంత జీవితానికీ విఘాతం కలిగిస్తోంది. సెక్స్‌కు సమాయత్తమైనపుడు ఫోన్ రింగ్ మోగడం ఏ భార్యా కూడా అంగీకరించదు. దీంతో సెల్ మోగినపుడు కోరికతో రగిలే శరీరాలు కాస్త గాలి తీసిన బెలూన్లలా చప్పబడి పోతారు.

అలాగే, సెక్స్‌లో పాల్గొనేందుకు సమయం సందర్భాన్ని పాటించాలి. మూడ్ వస్తే చాలు, భార్యను సెక్స్‌కు బలవంతం చేయడం కూడా ప్రమాదకరమేనని సెక్స్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల రాత్రి సమయాల్లో కూడా భాగస్వామితో సెక్స్‌లో పాల్గొనేందుకు పలువురు భార్యలు విముఖత చూపిస్తున్నట్టు వారు చెపుతున్నారు. అందుకే భార్యకు ఇష్టమైన సమయంలో సెక్స్‌ చేస్తూ,తనదారికి తెచ్చుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.

మరికొందరు పురుషులు సెక్స్‌కు ముందు తెగ హడావుడి పడిపోతుంటారు. భార్య కామ ప్రదేశాలను మృదువుగా స్పృశించాల్సిన చోట ఒడిసిపట్టి పిచ్చిగా పిచ్చిగా నొప్పి కలిగిలేలా ప్రవర్తిస్తుంటారు. దీంతో అప్పటి వరకు సెక్స్ కోసం తహతహలాడిన స్త్రీ ఆ రాక్షస సరసంతో భీతిల్లి ఎలా వదిలించుకోవాలా అని చూస్తుందని అంటున్నారు.English summary
Sexologists say that wives dislike some acts of their husbands regarding sex.
Story first published: Thursday, August 4, 2011, 17:30 [IST]

Get Notifications from Telugu Indiansutras