యౌవన దశకు చేరుకునేసరికి శరీరంలో రేగే సెక్స్ వాంఛలను తీర్చుకునేందుకు తహతహలాడుతుంటారు. ఇందుకోసం గోప్యంగా సెక్స్ సంబంధిత పుస్తకాలను చదివేందుకు ఆసక్తి కనబరుస్తారు. అయితే రతి సంబంధమైన విషయాలను గోప్యంగా చదవడం ఇంట్లో చేయకుండా కొందరు ఆఫీసుల్లోనో, చదువుకునే విద్యాలయాల్లోనో చేస్తుంటారు. ఈ విషయాన్ని ఎవరైనా గమనిస్తే భయపడిపోతూ చటుక్కున పుస్తకాన్ని దాచేస్తారు.
అయితే ఇటువంటి భేషజాలు పోవల్సిన అవసరం లేదని సెక్సాలజిస్టులు చెపుతున్నారు. జీవితంలో సగభాగం దాంపత్య జీవితంతో ముడిపడి ఉంటుంది కనుక రతి గురించిన అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఉందని వారు చెపుతున్నారు. అప్పుడు మాత్రమే దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుందని అంటున్నారు.
యౌవన ప్రారంభంలో ఇలా సిగ్గుపడిపోతూ సెక్స్ బుక్స్‌ చదవటం, పోర్న్ సైట్స్ చూడటం చేసే యువతీయువకులు పెళ్లయిన తర్వాత కూడా వాటిని ధైర్యంగా చూడట్లేదని చెపుతున్నారు. సెక్స్ విజ్ఞానం కలిగి ఉండటం వల్ల రతి సమయంలో ఎటువంటి పద్ధతులను అవలంభించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నవి తెలుసుకోవచ్చని చెపుతున్నారు. సెక్స్ సంబంధ సమాచారాన్ని వీలున్నప్పుడల్లా తెలుసుకోవడం ద్వారా సంసారం సుఖమయమవుతుందంటున్నారు.