కానీ అన్ని రోజులు తర్వాత పాల్గొనే సెక్స్ రొటీన్ సెక్స్‌కు భిన్నంగా, కొత్త అనుభవాన్ని ఇస్తుందని వారు చెప్పారు. ఇది సంభోగపరంగా ఎంతో మంచిదంటున్నారు. అంతేకాకుండా, సెక్స్‌కు ఎక్కువ రోజులు దూరంగా ఉండటం వల్ల పురుషుల అంగ స్తంభన సమయం కూడా ఎక్కువ సేపు ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి వారిలో స్ఖలనం ఆలస్యంగా జరుగుతుందట. అందువల్ల రతిలో మజా ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు. పైగా కొత్తకొత్తగా ప్రయోగాలు చేయాలని అనిపిస్తుందట.
నేటి యాంత్రిక జీవనంలో అనేక మంది దంపతులు రోజువారీ సెక్స్‌కు చాలా వరకు దూరంగా ఉంటారు. ముఖ్యంగా, భార్య ఒక చోట.. భర్త ఒక చోట ఉద్యోగాలు చేసే వారి పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ఇలా సెక్స్‌కు గ్యాప్ లభించడం కూడా మంచిదేనని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెక్స్‌లో గ్యాప్ తీసుకుంటే మనిషి ప్రవర్తన మారిపోతుందని వారు చెపుతున్నారు. దీని ప్రభావం అన్నింటిపైనా పడుతుందట. సెక్స్‌కి నాలుగైదు వారాలు దూరంగా ఉంటే చిరాకు, మానసిక ఒత్తిడి పెరగడం సాధారణం. ఆ సమయంలో ఆ సుఖం కోసం పురుషులు లేదా భార్యలు తెగ ఆత్రుత పడిపోతారు.