
2003 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా మడోన్నా - బ్రిట్నీ స్పియర్ లు లక్షలాది అభిమానుల ముందు ఒక స్టేజిపై బాహాటంగా పెదవులు కలిపి ముద్దులోని తీపిని ఆస్వాదించారు. దాని మజా ఎలా వుంటుందనేది ఇపుడు మహిళలు అనుభవించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. యువతులు వారిలో వారే.... మరో యువతితో పెదాలు కలిపి చుంబించటాన్ని 'ఫ్లెక్సీ సెక్సువాలిటీ' అని తాజాగా పిలుస్తున్నారు. అయినప్పటికి వీరు పురుషులచే ఆకర్షించబడుతున్నారు రతిక్రీడల్లో పురుషుల స్పర్శ కావాలని తహ తహ......లాడుతూనే వున్నారు. ఈ రకంగా ఆనందించుకొనే స్త్రీలు వారి లైంగికావసరాలకు ఇతర మహిళలతో ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ 'సరళ లైంగికత' ధోరణి నేటి యువతులలో పెరిగిపోతోంది. వీరేమైనా లెస్బియన్లుగా మారే అవకాశాలుండగలవా! అంటూ కూడా తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే, ఒక నివేదిక మేరకు ఈ సరళ లైంగికత విధానం ప్రస్తుతానికి మగ పిల్లలను హాట్...హాట్ గా ఆకర్షించేందుకు టీనేజ్ గరల్స్ లో హైస్కూలు స్ధాయిలో కొనసాగుతోంది. సెలిబ్రటీ అయిన లిండ్ సే ప్రస్తుతం తన మాజీ గరల్ ఫ్రెండ్ సమంతా రోన్సన్ తో డేటింగ్ చేస్తున్నట్లు అయినప్పటికి పురుషులంటే తనకి ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదని ఇటీవలే మీడియాకు వివరించటం ఈ సరళ లైంగికతలకు ఒక చక్కటి ఉదాహరణ.
సెక్స్ ఆనందాన్ని పొందటానికి ఎవరూ కూడా గే లేదా లెస్బియన్ అవ్వాల్సిన అవసరం లేదని 'సెక్సువల్ ఫ్లూయిడిటీ' పుస్తక రచయిత అంటారు. గతంలో స్వలింగ ఆకర్షణ కలిగితే వారిని ఆటోమేటిక్ గా లెస్బియన్లుగా పరిగణించేవారని అయితే ఇప్పటి మహిళలు దానికంటే మరింత అధిక సమస్యగా తయారయ్యారని కూడా ఆయన పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications



