నవరసాల్లో శృంగారానికి తొలి ప్రాధాన్యత ఉంది. అయితే, నేటి యువత దీనికి దూరంగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ముఖ్యంగా, 25 నుంచి 30 సంవత్సరాల వయస్సున్న, పెళ్ళైన మగ వారిలో (భర్తలు), 70 శాతం మంది తమ భాగస్వామితో శృంగారానికి దూరంగా ఉంటున్నారు.
ఇది చెపుతున్నది ఏ మీడియానో కాదు. కొందరు పరిశోధకులు చేసిన సర్వేలో వెల్లడైన వాస్తవం. ఈ వయస్సు మధ్యలో ఉన్నవారు ఆఫీసులకే పరిమితమై తమ భాగస్వామిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా సెక్స్ కు కూడా దూరంగా ఉంటున్నట్లు తేలింది.
ఇకపోతే...ఇదే వయస్సున్న మగవారిలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ప్రతి రోజూ సెక్స్ ను ఆస్వాదిస్తున్నారు. ఐదు శాతం మంది అసలు భావప్రాప్తి అంటే ఏంటో తెలియదట. మరో 26 శాతం మంది మాత్రం వారానికి ఒకసారి వీలు చూసుకుని భార్యతో ఎంజాయ్ చేస్తుండగా, 16 శాతం మంది పురుషులు వారానికి మూడు నాలుగు సార్లు, 15 శాతం మంది నెలకు ఒక్కసారి అంటే ఒక్కసారి మాత్రమే కామవాంఛను తీర్చుకుంటున్నట్టు ఈ సర్వేలో తేలింది.
అంటే, 25 నుంచి 30 యేళ్ళ మధ్యలో ఉన్నవారు సెక్స్ కంటే, తమ వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ సర్వే తేల్చింది. జీవితంలో పైకి రావాలనో, బాగా వృద్ది చెందాలనో, డబ్బు సంపాదించాలన్న లక్ష్యాలు ఉండటంతో పని రాక్షసులుగా మారి ఆఫీసులకే పరిమితమై పోతున్నారు. ఇలాంటి వారు రోజు 16 నుంచి 18 గంటల పాటు తమ సీట్లకే అంకితమై పోతున్నట్టు పేర్కొంది.
ఇకపోతే, నూటికో కోటికో ఒక్కరంటే ఒక్కరు మాత్రమే రోజుకు ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు భార్యతో సంభోగం చేస్తున్నట్ట ఈ సర్వేలో వెల్లడైంది. సెక్స్ విషయంలో మగరాయుళ్ళ మనస్తత్వం మార్చుకుని భాగస్వామితో ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించేలా చూసుకోవాలన్నది సైకాలజిస్టుల అభిప్రాయంగా ఉంది.