చాలాకాలం తర్వాతనే ఇరువురి మధ్య దాంపత్య బంధం ఏర్పడేది. కానీ ఇప్పుడు అందుకు పూర్తిగా విరుద్దం. ప్రస్తుత వివాహ వయస్సు 25 నుంచి 35 ఏండ్లకు పెరగడంతో ఆడవారిలోనూ, మగవారిలోనూ సెక్స్ భావాలు పెళ్లికి ముందే మేల్కొంటున్నాయి. ఫలితంగా అవాంఛిత గర్భదారణ, లైంగిక పరిణామాలు, ఎయిడ్స్ వంటి వ్యాధులు సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నుండి యువతను దూరంగా ఉంచాలంటే వారికి సెక్సు పట్ల పరిజ్ణానం కలిగేలా వ్యవహరించాలి. దానిని సాధారణమైనదిగా తీసుకునే విధంగా తయారు చేయాలి.
శృంగారం కేవలం సంతానం కోసమే మాత్రమే పరిమితం కాదు. యవ్వనంలో లైంగిక అవగాహన ఏర్పడితే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఆ వికాసం వారిలో గూడుకట్టుకుని ఉన్న గుడ్డి నమ్మకాలను పారద్రోలి సక్రమ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత వికాసంతోపాటు సామాజిక ప్రగతి కూడా సాధ్యమవుతుంది. ఒక శతాబ్దం క్రితం లైంగిక విజ్ఞానం అంతగా అవసరం ఉండేది కాదు. అప్పట్లో కేవలం 14, 15 ఏళ్లకే ఆడపిల్లలకు వివాహాలు జరిగేవి. అప్పటి ఆచారాలు, వ్యవహారాలు కారణంగా దంపతులు వారాలు, నెలలపాటు ఒకరికొకరు తాకే అవకాశం కలిగేది కాదు.