నెబ్రాస్కా విశ్వవిద్యాలయానికి చెందిన డయానా కోలోస్ వైసోకీ, వాష్ బర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన చెరిల్ చైల్డర్స్ లు సెక్స్ భాగస్వామి కోసం ఇంటర్నెట్ ద్వారా రాసలీలల జరిపే వారిపై అధ్యయనం జరిపింది. కొత్తదనం కోసం తాపత్రయ పడే ఈ మహా కంత్రీలు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లను ఉపయోగించుకుంటూ, సెక్స్టింగ్ అనే నూతన ప్రకృయకు పాల్పడుతున్నారని ఈ బృందం పేర్కొంది. ఎదుట వ్యక్తుల్లో లైంగిక వాంఛను పెంచేందుకు ఈ ఉద్దండులు తమ నగ్నచిత్రాలతో పాటు ఇతర శృంగార ప్రేరిపిత సందేశాలను మెయిల్స్ ద్వారా పంపుతారట.
పెళ్లైన వారిపై వైసోకీ, చైల్డర్స్ జరిపిన ఈ పరిశోధనలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాంపత్య జీవితం పై విసుగు చెందిన పలువురు కొత్త సెక్స్ భాగస్వామి కోసం సోషల్ నెటవర్కింగ్ సైట్లను ఆశ్రయిస్తున్నారట. ఈ పరిశోధనలో భాగంగా వైసోకీ, చైల్డర్స్ ల బృందం మొత్తం 5,187 మంది వయోజనులను ప్రశ్నించిందట. వీరిలో చాలమంది సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ఛాటింగ్ ద్వారా రియల్ లైఫ్ పార్టనర్లను కోరుకుంటే, మరి కొంత మంది డేటింగ్, ఇంకొంత మంది లైంగిక చర్యలను కోరుకుంటున్నారట.
ఈ మోడరన్ బంధాలకు సంబంధించి అధ్యయానాలు జరిపిన పరిశోధకులు మానవ సంబంధాలు ధృడ పడాలంటే ఫేస్ టూ ఫేస్ రిలేషన్ తప్పనిసరని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వర్చువల్ సెక్స్‌ వాస్తవమైన శృంగార కార్యాచరణకు ప్రత్యామ్నాయం కాదని అధ్యయనంలో తేల్చారు.