ప్రశంసించండి !
ప్రశంసించండి. మిమ్మల్ని మీరు మెచ్చుకోండి, మీ భాగస్వామిని అభినందించండి. ప్రశంసలు మీ యొక్క సంబంధాలకు కొత్త అర్ధాలను చెప్పి జీవితాన్ని మరింత రొమాంటిక్ గా చేస్తాయి. జీవితంలోని మధుర క్షణాలను తరచుగా గుర్తుకు తెచ్చుకోండి.
పని విభజించుకోండి !
ఇంటి పనా ? ఇంటిపనిలో చేతనైనంత సహకరించండి. సాధారణంగా మహిళలు ఇంటిపని భారంతో సతమతమవుతూంటారు. సహకరించటానికి మీకిది మంచి అవకాశం. అవసరమైతే పనులు విభజించి కేటాయించుకోండి. ఎపుడు ఎవరు ఏది చేయాలనేది నిర్ణయం చేసుకోండి. మహిళలు సెక్స్ అంటే వ్యతిరేకించటానికి వారి ఇంటి పని భారం అడ్డంకి అని కూడా చెప్పవచ్చు.
బెడ్ రూమ్ అందంగా అలంకరించండి !
బెడ్ రూమ్ లోకి చొచ్చుకు పొండి. పడక గదిలో చిందర వందరగా వున్న వన్నీ నీట్ గా సర్దేయండి. బెడ్స్ మిమ్ములను ఆహ్వానిస్తున్నాయా ? అనేట్లు అందంగా అమర్చండి. సువాసనలు వెదజల్లే అగరబత్తీలను వెలిగించండి. రూమ్ ఫ్రెషనర్స్ ఉపయోగించండి. మీరిద్దరే వున్న ఫొటోలు బాగా కనపడేటట్లు అమర్చండి. బెడ్ రూమ్ లో ల్యాప్ టాప్ లు, టి.వి. లేదా ఇతర పని సంబంధిత పరికరాలు వుంచకండి.
సరసాలాడండి !
భాగస్వామితో వాదనలకు దిగకండి. అవసరాన్ని బట్టి సరసోక్తులను ప్రసంగించండి. నిందలు మోపటం, గతంలోని తప్పులు వెతకటం లాంటివి ఈ సమయంలో చేయవద్దు.
డ్యాన్సులు చేయండి !
ఇక మ్యూజిక్ పెట్టండి. వీలైతే డ్యాన్స్ చేయండి. డ్యాన్సింగ్ అనేది శరీరవ్యవస్ధకు ఒక మత్తుమందులా పని చేస్తుంది. దానితో మీరు ఎంతో ఆనందంగా ఉంటారు, ఆ ఆనందం మీరు ఉపక్రమించే సంభోగానికి మరింత ఉత్సాహాన్నిస్తుంది.