2003 -04 నాటికి 20.5 సంవత్సరాల వయస్సు ఉన్న 574 యువకులు, 737 యువతల సెక్స్ అనుభవాలను ఈ బృందం ఆధ్యయనానికి ఉపయోగించింది. వీరిలో 55 శాతం మంది తమ కడపటి సెక్స్యల్ పార్టనర్ ప్రత్యేకంగా డేటింగ్ పార్టనర్ అని. మరో 25 శాతం మంది తమ కడపటి సెక్స్ భాగస్వామి తమ జీవిత భాగస్వామని తెలిపారు. 12 శాతం మంది తమ కడపటి సెక్స భాగస్వామి తమకి క్లోజే గాని తమకే ప్రత్యేకం కాదని, 8 శాతం మంది మాత్రం తమ కడపటి సెక్స్ అనుకోకుండా జరిగిందని చెప్పుకొచ్చారు.
ఈ అధ్యయనంలో అధిక శాతం మంది తాము ప్రేమించిన వారితోనే కాకుండా, ఇతరులతో కూడా సెక్స్ చర్యల్లో పాలుపంచుకున్నారని పరిశోధకులు విశ్లేషించారు. సాధరాణంగా సెక్స్ లో పాల్గొ న్న యువతకు మానిసక అందోళణ అంతగా ఉండదని, ఆసాధారణంగా సెక్స్ చర్యల్లో పాల్గొన్న యువత పై మానసిక ఆందోళణ అధికంగా ఉంటుందని బృంద పరిశోధకుడు ఎసిన్ బర్గ్ స్పష్టం చేశారు. యువతలో సెక్స చర్యలు శృతి మించకుండా ఉండేందుకు సెక్స విద్యకు సంబంధించి కౌన్సిలింగ్ తరగతులు నిర్వహించాలని ఆయన కోరారు.