ఇక భార్య - నేను సర్వస్వతంత్రురాలని అన్న రీతిలో భర్త ఎదుట ప్రవర్తించవద్దు. భర్త ఎదుట మీ పురుష సహోదోగ్యులను ప్రశంసించకండి. మీ బాస్ నిజంగా గొప్పవాడైనప్పటికీ, ఆ విషయాన్ని మీ శ్రీవారి సమక్షంలో ప్రస్తావిస్తే ఆయన అసూయను పెంచుకునే ప్రమాదముంది. పిల్లల కోసం ఆదుర్దా చెందకండి. అది మీ ఉద్యోగాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. పిల్లలను ఎప్పుడు పొందాలనే అంశంపై మీ భర్తతో సంప్రదించి ఒక నిర్ణయానికి రండి.
నిత్యావసర వస్తువుల ధరలు తారలతో గగన విహారం చేస్తున్న ప్రస్తుత తరుణంలో... భార్యభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేస్తే కాని ఇళ్ళు గడవదు. ఈ నేపధ్యంలో ఉద్యోగాలు చేసుకుంటూనే భార్యభర్తలు తమ వైవాహిక జీవితాన్ని ఎలా ఆనందంగా గడుపవచ్చునో తెలిపే కొన్ని చిట్కాలను మీ ముందు ఉంచుతున్నాం. భర్తలు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినవి- ఇంటి పనులలో అంటే వంటవార్పులలో, గృహాలంకరణలో భార్యకు సహకరించండి. పనిమనిషి రానిరోజు అవసరమైతే పాత్రలను శుభ్రం చేసేందుకు సైతం వెనుకాడకండి. పురుషులైన ఆమె తోటి ఉద్యోగస్థుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను అనుమానించకండి. ఆమె వ్యక్తిత్వాన్ని శంకించక, ఆఫీసులో జరిగే పార్టీలకు, పిక్నిక్‌లకు ఆమెను ఒంటరిగా వెళ్ళనివ్వండి