•  

పెళ్లైన కొత్తలోలా ఉంటే...

Romance
 
పెళ్లైన కొత్త రోజులను మళ్లీ మనం గుర్తు తెచ్చుకొని అలా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. భార్యాభర్తలు నిత్యం సంతోషంగా ఉండటానికి తొలి రోజుల అంశాలు కొన్ని గుర్తుకు తెచ్చుకొని వాటిని ఫాలో కావాలి. తొలి రోజుల్లో మీ భాగస్వామి చెప్పే ప్రతి జోకుకు అది నవ్వు తెప్పించినా, తెప్పించకపోయినా మీరు పడిపడినవ్వుతారు. కానీ క్రమంగా అది తగ్గిపోతుంది. ఈ విషయంలో పెళ్లైన కొత్తలో లాగ ఉండటానికి ప్రయత్నించండి.

తొలి చూపుతోనే మిమ్మల్ని మీరు మరిచిపోయిన తరుణాన ఈ మాటను మీరు అనే ఉంటారు. ఇద్దరు కలిసి ఏదైనా పార్టీకి లేదా వివాహానికి వెళ్ళినప్పుడు మీ జీవితభాగస్వామి నుంచి విడిపోయి, మీ భాగస్వామిని దూరం నుంచి కన్నార్పకుండా చూడటం మొదలుపెట్టండి.

తొలిసారిగా చూస్తున్నాను అన్న భావనను కలిగించేలా చూడండి. మీ జీవిత భాగస్వామి ఆఫీసులో ఉండగా ఫోన్ చేసి ఆఫీసుకు డుమ్మా కొట్టమని చెప్పండి. రాగానే ఇద్దరూ కలిసి తొలినాళ్ళలో కలుసుకుంటూ ఉండే చోటుకు చేరుకోండి. చేయి చేయి కలిపి నడవండి. ప్రేమ పక్షుల్లా కువకువలాడుతూ ప్రేమ కబుర్లు చెప్పుకోండి. మున్ముందు ఏంచేయాలో మాట్లాడుకోండి.

English summary
If husband and wife behave like new married pair their life will be very happy.
Story first published: Sunday, July 17, 2011, 15:35 [IST]

Get Notifications from Telugu Indiansutras