పడకగదిలో అల్లరి చేసే దంపతుల విషయంలో ఓ అపోహ ఉంది. వారు బడాయి కొడుతున్నారని అనుకుంటూ ఉంటారు. కానీ, శబ్దాలు చేస్తూ, మాట్లాడుతూ రతిక్రీడ చేసేవారు ఎక్కువ ఆనందాన్ని, సుఖాన్ని పొందుతారని నిపుణులు అంటున్నారు. ఆనందాన్ని వ్యక్తం చేయడానికి, సుఖాన్ని పెంచుకోవడానికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని బ్రిటిష్ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
తన పురుష భాగస్వామి మాటలు చెబుతూ రతి కార్యం చేస్తుంటే మహిళలు చాలా బాగా స్పందిస్తారట. లీడ్స్ విశ్వవిద్యాలయం పరిశోధన ఈ విషయాన్ని కనిపెట్టింది. రతి కార్యంలో తాము ఊగిపోతున్నామని, తాము బాగా సెక్స్ చేస్తున్నామనే భావన కలిగి దంపతులు ఎక్కువ సంతృప్తిని, సుఖప్రాప్తిని పొందుతారని ఆ పరిశోధనవ తేల్చింది. తమ శ్రమ ఫలిస్తుందనే తృప్తి వల్ల ఎక్కువ ఆనందం పొందుతారట.
తన మహిళా భాగస్వామి శబ్దాలు చేస్తుంటే పురుషుడు ఎక్కువ ఆనందిస్తాడట. రతి కార్యం సందర్భంగా తాము చేసే శబ్దాల గురించి 71 శాతం మహిళలు వివరాలు అందించారు. సంభోగానికి ముందు, తమ పురుష భాగస్వామి స్కలనం జరిగే సమయంలో మహిళలు ఎక్కువ శబ్దం చేస్తారట. ఇది కావాలని చేసేదే అని అంటున్నారు.
తమ భాగస్వామి రతి కార్యాన్ని పూర్తి చేయడానికి కావాలని తాము శబ్దాలు చేస్తామని మూడింట రెండు వంతుల మంది మహిళలు చెప్పారు. తమ రతి భాగస్వామి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి శబ్దాలు ఉపయోగపడుతాయని 92 శాతం మంది చెప్పారు. ఈ ప్రయోజనం కోసమే మాటల మంత్రాలను ప్రయోగిస్తున్నట్లు 87 శాతం మంది చెప్పారు.
పడకగదిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ శబ్దాలు చేస్తారట. ఇవి కూజితాల రూపంలో కూడా ఉంటాయి. తమ సుఖప్రాప్తి గాఢత కోసం వారు కూజితాలు చేస్తారని అంటున్నారు. తాము ఆనందం పొందుతున్నామని తన పురుష భాగస్వామికి తెలియజేయడానికి కూడా మహిళలు అలా చేస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.