•  

సెక్సుతో నొప్పులు మాయం

Kamasutra-Romance
 
రతిక్రియలో పాల్గొనాలంటే చాలామంది మహిళల్లో అనాసక్తి కలగుతుంటుంది. కారణం ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పలు పనులతో సతమతమౌతుంటారు. దీంతో వారికి ఆ పనిపై ఆసక్తి తగ్గిపోతుంటుంది. పైగా భర్త రతిక్రియకు సన్నద్దమౌతున్నప్పుడే ఆహ్, ఊఁ, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి, మెడ నొప్పి, ఏదో ఒకటి చెప్పి తమ జీవిత భాగస్వామికి ఆ మూడ్‌ పోయేలా వ్యవహరిస్తుంటారు. కాని నొప్పులు మటుమాయమవ్వాలంటే రతిక్రియలో పాల్గొనడమే అత్యుత్తమమైన ఔషధమంటున్నారు పరిశోధకులు.

కావాలనే మహిళలు ఇలా అంటారనుకోవడం పొరబాటు. రతిక్రియలో పాల్గొనాలనే కోరిక మహిళల్లోను ఉంటుంది. కాని పనుల ఒత్తిడి వలన శరీరం అలసిపోతుంది. దీంతో ఆ క్రియలో పాల్గొనాలనే కోరిక చల్లారిపోతుందంటున్నారు పరిశోధకులు. అధిక పని భారం వలన రాత్రి ఎప్పుడెప్పుడు నిద్రకుపక్రమిస్తామా అని మహిళల శరీరం నిద్రపోవాలని కోరుకుంటుంటుంది. కాబట్టి మహిళలు రాత్రి తమ జీవిత భాగస్వామితో రతిక్రియలో పాల్గొనేందుకు ముందుగానే మనసును సిద్ధం చేసుకుంటే ఆ క్రియలో మహిళలు చాలా ఉత్సాహంగా పాల్గొనగలుగుతారని పరిశోధకులు పేర్కొన్నారు.

English summary
It seems, pains will ends with sex.
Story first published: Sunday, June 19, 2011, 10:13 [IST]

Get Notifications from Telugu Indiansutras