దీనివల్ల ఎటువంటి నష్టం కానీ, ఎలాంటి ప్రమాదం కానీ లేదని సెక్స్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ స్వయంతృప్తి అలవాటు వల్ల మనసు విపరీతమైన కోరికలతో తప్పుడు కార్యాల వైపు మళ్లే అవకాశం బాగా తగ్గుతుంది. స్వయంతృప్తిని ఎన్నిసార్లు పొందినా దానివల్ల కోల్పోయేదేమీ లేదు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరికైనా పైన చెప్పిన విషయాలు వర్తిస్తాయి. ఎయిడ్స్ లాంటి సుఖవ్యాధులు ప్రబలిపోతున్న ప్రస్తుత కాలంలో యువత అరక్షిత సెక్స్ వైపుగా వెళ్లి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి స్వయంతృప్తి అలవాటు సైతం ఓ మార్గమని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ స్వయంతృప్తి విషయంలో వారు కొన్ని సూచనలు సైతం చేస్తున్నారు. స్వయంతృప్తి అనేది ఓ అలవాటుగా ఉండాలే కానీ అది ఓ వ్యసనంగా మారకూడదు. స్వయంతృప్తి అనే పేరుతో నిరంతరం అదే విషయానికి ప్రాముఖ్యమిస్తే మిగిలిన విషయాల్లో వారు వెనుకబడే అవకాశముంది.
యుక్త వయసు వచ్చాక సెక్స్ కోరికలు మనసు తలుపు తట్టడం మొదలు పెడతాయి. దాంతో యుక్త వయసులోకి ప్రవేశించిన వారిలో సెక్స్ అనే అంశంపై అందాక లేని ఓ వింత ఆసక్తి ఏర్పడుతుంది. ఆ క్రమంలో మదిలో చిరు ప్రకంపనలు సైతం మొదలౌతుంది. దాంతో కొత్త సెక్స్ అనుభవం కోసం మనసు పరిపరి విధాలుగా పోవడం ప్రారంభిస్తుంది. కానీ యవ్వనంలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే సెక్స్ అనుభవమంటే భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకున్నట్టే. అలాంటి తరుణంలో ఎగసిపడే యవ్వన కోరికల అలలను తట్టుకోవాలంటే యవ్వనంలో అక్కరకొచ్చే ఓ సాధనం స్వయంతృప్తి. దీన్నే హస్తప్రయోగం అనే పేరుతోను పిలుస్తుంటారు. అలాంటి స్వయంతృప్తి అలవాటుపై కొందరు వైద్య నిపుణుల ఇస్తున్న వివరణను క్రోడీకరించి అందిస్తున్నదే ఈ వ్యాసం. స్వయంతృప్తి అనేది యవ్వన ప్రాయంలో ఇబ్బందిపెట్టే సెక్స్ కోరికలనుంచి తప్పించుకోవడానికి ఓ ప్రత్యామ్నాయం లాంటిది.