•  

అనవసర అపోహలతో సెక్సులో విఫలం

Disillusions in Sex will create problems
 
తమ మీద తమకు నమ్మకం లేనివారికి సెక్స్ ఆనందం కరవవుతుంది. శారీరక అవసరాలలో ఒకటైన సెక్స్ సుఖానికి దూరమవుతున్న జంటలు గుర్తించాల్సిన అంశం ఇది. తన శక్తి మీద తనకు నమ్మకం లేని పురుషుడు సెక్స్‌కి సిద్ధం కాలేడు. తన భార్యను సిద్ధం చేయలేడు. తన శరీర రూపం మీద తనకే ఇష్టం లేని అమ్మాయి సెక్స్ వద్దనుకుంటుంది. ఒకటి రెండు కిలోల బరువు పెరిగి, పొట్ట వచ్చింది కాబట్టి భర్తను తాను ఆకర్షించలేకపోతున్నానన్న సందేహంతో సెక్స్‌కి దూరమయ్యే ఆడవారు కూడా ఉన్నారు.

అంతేకాదు తమ వక్షోజ రూపం చిన్నదిగా ఉందని సిగ్గుపడి సహకరించనివారు కూడా ఉన్నారు. ఆ భయంతోనే సెక్స్ సమయంలో దీపం వద్దంటారు. దీపం వేయగానే కుంచించుకుపోయి సెక్స్ మూడ్‌లో నుండి బయటపడిపోతారు. మగవారైతే తన అంగ పరిమాణం, శక్తి మీద పెంచుకున్న అనవసరపు భయాలతో వారిలో శీఘ్రస్ఖలనం, సైక్స్ వైఫల్యం ఏర్పడుతుంది. వైఫల్య భయం మనసును వేధిస్తుండగా చేసే సెక్స్ ప్రయత్నంలో నిజంగానే విఫలమవుతాయి.

English summary
Men or women are fail in unimportant issues in Sex.
Story first published: Tuesday, June 28, 2011, 17:10 [IST]

Get Notifications from Telugu Indiansutras