సాధారణంగా శోభనం రాత్రి అనేది కేవలం తమలోని సెక్స్ కోరికలు తీర్చుకోవడానికే పెద్దలు కేటాయించిన రాత్రిగా చెప్పుకుంటారు. ఈ విషయం తెలిసి కూడా చాలా మంది యువకులు పూర్తిగా విఫలమై తమ భాగస్వామి వద్ద చులకనవుతారు.
వాస్తవానికి ఇలా జరగడానికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు.
రోజంతా పెళ్లి హడావిడి, పెళ్లి తతంగాలతో వధూవరులిద్దరూ బాగా అలసిపోయి ఉంటారు. రాత్రి వచ్చే సరికి పూజారి కలిసి శోభనం ముహుర్తం ఖరారు చేయడం, శోభనం గదిని అలంకరించే సరికి ఏ అర్థరాత్రో అవుతుంది. అప్పటికే అలసిపోయి ఉన్న వధూవరులు అర్థరాత్రి అయ్యే సమయానికి బాగా నిద్రముంచుకొస్తుంది. తీరా పడక గదిలోకి వెళ్లాక అక్కడ వాతావరణం, ఏర్పాట్లు చూసి ఒకింత ఆశ్చర్యానికి, సిగ్గుకు గురవుతారు. దీనికితోడు గది వాతావరణం మరింత వేడిగా ఉంటే చెమట ఎక్కువగా పోస్తుంటుంది.
దీంతో వారిద్దరిలో చికాకు పుట్టుకొస్తుంది. ఇలాంటి వాతావరణంలో భార్యను దగ్గరకు తీసుకొని ముద్దూ ముచ్చట, కౌగిలింతలతో కామోద్రేకాన్న పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇది కొంతమందిలో సక్సెస్ కావచ్చు. మరికొందరిలో అంగం గట్టి పడక పోవడమో లేదా గట్టిపడినా వెంటనే వీర్య స్కలనం కావడమో జరిగిపోతుంది. దీనికి తోడు నిద్రమత్తు, అలసట, నరాలను మరింతగా కృంగదీస్తుంది.