పెళ్లయిన కొత్తలో దంపతులు రోజుకు నాలుగైదు సార్లు సెక్స్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇది క్రమంగా తగ్గిపోతుంది. దీనికి అనేక కారణాలు లేకపోలేదు. ప్రస్తుత యాంత్రిక జీవితంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. దీంతో ఇంటికి వచ్చే సరికి వారు అలసిసొలసి పోతారు. వీటికి తోడు కుటుంబ సమస్యలు, ఆఫీసు, వ్యాపార సమస్యలు ఉంటాయి. దీంతో సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపరు. పైగా వయస్సు పెరిగే కొద్దీ సెక్స్ సామర్థ్యంతో పాటు ఇతర సమస్యలూ వారిని వేధిస్తుంటాయి. దీంతో సెక్స్ పట్ల వారి ఆసక్తి తగ్గిపోతుంది. అంతమాత్రాన తమలో సెక్స్ సామర్థ్యం పూర్తిగా నశించిపోయిందని ఆందోళన చెందకూడదని అంటున్నారు నిపుణులు. సెక్స్ కోర్కెలనేవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయన్నది వారి అభిప్రాయంగా ఉంది.
వంశపారంపర్య లక్షణంగా, శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు, వయస్సు, తగిన జోడు వంటివాటిని బట్టి సెక్స్ కోర్కెలు ఉంటాయని అంటున్నారు. మనిషిలో కొన్ని సందర్భాల్లో అధికంగా సెక్స్ కోర్కెలు ఉవ్వెత్తున ఎగసిపడటం, మరికొన్నిసార్లు తక్కువగా ఉండటం సహజమే. ముఖ్యంగా నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంటున్న సమస్యలు మానసిక ఒత్తిడి, ఆందోళనలు. వీటికి మెడిటేషన్ ద్వారా చెక్ పెట్టినట్టయితే సెక్స్‌పై కోర్కెలు యధావిధిగా కలుగుతాయని అంటున్నారు. సెక్స్‌కు శక్తినిచ్చే పోషకాహారాలు తీసుకుంటే దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపవచ్చంటున్నారు.
Indiansutras - Get Notifications. Subscribe to Telugu Indiansutras.