లేనిపక్షంలో ఇది తక్కువగానూ... మరికొంతమందిలో అస్సలు లేకుండా పోయేందుకు అవకాశం ఉంది. దంపతులిద్దరూ ఉద్యోగస్తులైతే వారిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. తమతమ కార్యాల్లో ఉండే పని ఒత్తిడిబట్టి కూడా వాళ్ళ మానసిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అటు ఆఫీసుతో పాటు.. ఇటు ఇంటిలో పని ఎక్కువైతే సంభోగాన్ని మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఆ పని అంటేనే విముఖత చూపిస్తుంటారు. మరికొందరు పురుషులు భార్య మనస్సులోని కోర్కెను తెలుసుకోకుండా సంభోగాన్ని హడావుడిగా పూర్తి చేసి అటువైపుకు తిరిగి పడుకుంటారు. ఇవతల తమ పార్టనర్ తీవ్ర అసంతృప్తికి లోనవుతుంది.
శృంగారంలో పాల్గొనే ఆలుమగల మధ్య అవగాహన అనేది ఎంతో ముఖ్యం. ఈ అవగాహన ఏ ఒక్కరిలో లోపించినా వారి శృంగార జీవితం అసంతృప్తిగా సాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ముఖ్యంగా, కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య ఇది ఎంతో ముఖ్యం. ఈ భావన వారి మనుస్సుల్లో లేనిపక్షంలో సెక్స్ నిపుణులను సంప్రదించి వారి అపోహలను తొలగించుకోవచ్చు. సాధారణంగా భావప్రాప్తి అనేది ఒక మానసిక భావన మాత్రమే. మనస్సు ఉల్లాసంగా, ఉద్వేగంగా.. భర్తపై అన్యోన్యంగా ఉంటేనే ఇది కలుగుతుంది.